New Year Celebrations Restrictions in Hyderabad 2024 : త్వరలోనే నూతన ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈసారి న్యూయర్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని హైదరాబాద్ మహానగరం సిద్ధమవుతుంది. ఇంతలోనే నగర పోలీసులు న్యూయర్(New Year) ఆంక్షలు అంటూ ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని చెప్పారు. వేడుకలు నిర్వహించే బహిరంగ ప్రదేశాలు, రెస్టారెంట్లు, పబ్బులు, బార్లు రాత్రి 1 గంట వరకు మూసివేయాలని తెలిపారు. న్యూయర్ సంబురాలను(New Year Celebrations 2024) నిర్వహించాలనే నిర్వాహకులు పది రోజుల ముందుగానే అనుమతులు తీసుకోవాలని సూచించారు.
ప్రతీ ఈవెంట్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని నగర పోలీసులు(New Year Restrictions) ఆదేశించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉండకూడదని తెలిపారు. వేడుకల్లో కెపాసిటీని మించి పాసులు ఇవ్వొద్దని నిర్వాహకులను హెచ్చరించారు. వేడుకల్లో పాల్గొనే వారికి పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు.
New Year Celebrations 2024 in Hyderabad : లిక్కర్ వినియోగించే వేడుకల్లో మైనర్లకు అనుమతి లేదన్నారు. అలా మైనర్లను అనుమతిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నూతన ఏడాది వేడుకల్లో పాల్గొనే వారు డ్రగ్స్(Drugs) వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష పడుతుందని అన్నారు. మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని హెచ్చరించారు.
పబ్బుల్లో డాగ్స్‌తో పోలీసుల తనిఖీలు - పట్టుబడితే కష్టమే మరీ
న్యూయర్ వేడుకలకు పోలీసుల ఆంక్షలు ఇవే :
- బహిరంగ ప్రదేశాలు, రెస్టారెంట్లు, పబ్బులు, బార్లు రాత్రి 1 గంట వరకే ఉండాలి.
- న్యూయర్ వేడుకలు నిర్వహించే నిర్వాహకులు పది రోజుల ముందు నుంచే అనుమతులు తీసుకోవాలి.
- ప్రతీ ఈవెంట్లో సీసీ కెమెరాలు,సెక్యూరిటీ సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి.
- అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు.
- వేడుకల్లో లౌడ్ స్పీకర్ల శబ్ధ తీవ్రత 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.
- వేడుకలకు ఎవరూ కెపాసిటీకి మించి పాసులు ఇవ్వవద్దు.
- వేడుకల వద్ద పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూడాలి.
- లిక్కర్ వినియోగించే వేడుకల్లో మైనర్లకు అనుమతి లేదు.
- నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వాడుకూడదు.
- మద్యం సేవించి వాహనం నడుపరాదు.
- మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష, మూడు నెలలు పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.
న్యూయర్ వేడుకల్లో పాల్గొంటున్నారా.. అయితే ఈ నియమాలు పాటించాల్సిందే!
భాగ్యనగరంలోకి న్యూ ఇయర్ డ్రగ్స్ - అడుగడుగునా నిఘాతో పోలీసుల స్పెషల్ డ్రైవ్