New Year 2024 Hyderabad : న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. క్రిస్మస్ నుంచి ఈ సంబురాలు మొదలయ్యాయి. నయా సాల్ పార్టీలతో జోష్ తారాస్థాయికి చేరనుంది. డిసెంబరు 31 ఆదివారం కావడంతో ఈసారి సిటీలో పెద్ద ఎత్తున నూతన సంవత్సరం పార్టీల కోసం ఈవెంట్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా తారలను, డీజేలను వేడుకలకు ఇన్వైట్ చేస్తున్నారు.
New Year Celebrations 2024 : స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య ఎవరి స్థాయిలో వారు వేడుకలు నిర్వహించుకునేందుకు గెస్ట్ హౌస్‌లు, రిసార్టులు బుక్ చేస్తున్నారు. అమ్యూజ్‌మెంట్ పార్కులు, క్లబ్‌లు, స్టార్ హోటల్స్, కన్వెన్షన్లలో సెలబ్రేషన్స్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు గేటెడ్ కమ్యూనిటీల్లోనూ భారీ ఎత్తున వేడుకలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రముఖులు, వ్యాపార వర్గాలు గోవాలో, విదేశాల్లో న్యూ ఇయర్ పార్టీలకు తరలి వెళ్తున్నారు.
New Year Events in Hyderabad 2024 : న్యూ ఇయర్ పార్టీలను నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొత్త థీమ్‌లతో నిర్వహిస్తుంటారు. మైదానాల్లో విద్యుత్తు ధగధగల నడుమ లైవ్ మ్యూజిక్, దేశ, విదేశాల నుంచి రప్పించిన డీజేల సంగీత హోరులో సెలబ్రేషన్స్ నిర్వహణ మొదలు ఇండోర్‌లో పార్టీల వరకు వేర్వేరు థీమ్‌లతో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ముఖానికి మాస్కు ధరించి వేడుకల్లో పాల్గొనే వేడుకలకు ఒక సంస్థ నిర్వహిస్తోంది. ఇంగ్లీష్, బాలీవుడ్, టాలీవుడ్ సంగీతంతో వేడుకలకు వచ్చిన వారిని 5-6 గంటలపాటు అలరించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
న్యూ ఇయర్ షాపింగ్ చేయాలా? ఇలా చేస్తే క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ పక్కా!
సిటీలో హైటెక్స్‌లో పార్టీ జరగనుండగా రామోజీ ఫిల్మ్‌సిటీలో రెడ్ వెల్వెట్, థ్రిల్ బ్లాస్ట్ పేరుతో నూతన సంవత్సర పార్టీలను గాలానైట్ పేరుతో నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి 7గంటలకు మొదలయ్యే పార్టీలు అర్ధరాత్రి 1 గంట వరకు జరుగుతాయి. ఆ సమయంలో సెలబ్రేషన్స్‌కు వచ్చిన వారు ఇంటికి చేరుకోవడం సురక్షితం కాదని భావించేవారి కోసం ఈవెంట్స్ నిర్వాహకులు అక్కడే బస చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రంతా క్యాంప్ ఫైర్, మ్యూజిక్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కొత్త ఏడాదిని బాయ్ ఫ్రెండ్‌తో శృతి చేసిన హాసన్
ఓపెన్ ఎరినాలో వేడుకలకు కుర్రకారు ఉత్సాహం ప్రదర్శిస్తోంది. లైవ్ మ్యూజిక్కు అనుగుణంగా నృత్యాలతో యువత హోరెత్తించనుంది. రూ.799 నుంచి జంటకు రూ. 25వేల వరకు ఛార్జ్ చేస్తున్న వేడుకలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు కూర్చుని వేడుకలకు ఆస్వాదించే కార్యక్రమాలు ఎక్కువగా హోటళ్లో ఉన్నాయి. ఇవీ ఒక్కొక్కరికి రూ.600 నుంచి రూ.12వేల వరకు ఛార్జ్ తీసుకుంటున్నారు. కొవిడ్ కొత్త వేరియంట్ భయాలున్నా న్యూ ఇయర్ పార్టీలకు మాత్రం నగరవాసులు వెనుకడుగు వేయడం లేదు.