రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన ఆబ్కారీ విధానంలో అదనపు దుకాణాలకు సంబంధించిన అంశాన్ని చేర్చబోతున్నారు అధికారులు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటైన దృష్ట్యా వాటికి తగ్గట్టుగానే దుకాణాల సంఖ్య పెంచాలని భావిస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలోనూ కనీసం ఒక మద్యం దకాణం ఉండేలా అధికారులు పరిశీలిస్తున్నారు.
త్వరలోనే అమల్లోకి దుకాణాలు...
పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 125 మండలాలు ఏర్పడ్డాయి. వీటిలో దాదాపు సగం వరకు మండల కేంద్రాల్లో దుకాణాలు లేవు. ఆయా చోట్ల ఏర్పాటుకు అవకాశం ఇవ్వటంతో పాటు డిమాండును బట్టి మిగతా మండల కేంద్రాలకూ మరికొన్ని ఇవ్వాలని భావిస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఇది రెండేళ్లపాటు ఉంటుంది. దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయటంలో అధికారులు నిమగ్నమయ్యారు. కసరత్తు త్వరలోనే కొలిక్కిరానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,216 వైన్ దుకాణాలు, 670 బార్లున్నాయి.
ఇవీ చూడండి: భవనాల కూల్చివేతకు హెచ్‌ఎండీఏ అనుమతి ఉందా?