కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) పంపిణీ ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) ఆదేశించారు. పౌరసరఫరాల శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 26వ తేదీ నుంచి రేషన్ కార్డులు పంపిణీ చేయాలని మంత్రి గంగుల కమలాకర్ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకొని అర్హత పొందిన మూడు లక్షలా 60 వేలకు పైగా ఉన్న లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో విధిగా పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు.
జూలై 26 నుంచి 31 వరకు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. కొత్తగా రేషన్ కార్డులు పొందే లబ్ధిదారులకు అగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ను సీఎం ఆదేశించారు.
ఇదీ చదవండి: వాగులో చిక్కుకున్న ఎనిమిది మంది.. కాపాడేందుకు స్థానికుల ప్రయత్నం