ETV Bharat / state

RATION CARDS: వేగం పుంజుకున్న కొత్త రేషన్​కార్డుల జారీ ప్రక్రియ - New ration cards in telangana

రాష్ట్రంలో కొత్త రేషన్​కార్డుల జారీ ప్రక్రియ వేగం పుంజుకుంది. పెండింగ్​లో ఉన్న 4.97 లక్షల దరఖాస్తులను ఈ నెల 25లోపు పరిశీలించి.. వీలైనంత త్వరగా కొత్త కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

RATION CARDS: వేగం పుంజుకున్న కొత్త రేషన్​కార్డుల జారీ ప్రక్రియ

author img

By

Published : Jun 18, 2021, 9:59 PM IST

రాష్ట్రంలో కొత్త రేషన్​కార్డుల జారీపై సర్కారు దృష్టి సారించింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిష్కరించి.. కొత్త రేషన్​కార్డులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు పెద్దసంఖ్యలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అందులో కొన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా.. ప్రస్తుతం 4.97 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాల్లో రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరతకు తోడు పౌర సరఫరాల శాఖ సకాలంలో ఆ కసరత్తు పూర్తి చేయకపోవడంతో జాప్యం నెలకొంది.

కొత్త రేషన్ రేషన్ కార్డుల డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో త్వరలో జారీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల వెల్లడించారు. అనంతరం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆ అంశంపై విస్తృతంగా చర్చించి విధివిధానాలు ఖరారు చేసిన నివేదిక సమర్పించాలని కోరింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు ప్రత్యేకించి హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ ఈ దరఖాస్తుల పరిశీలన కసరత్తు ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అన్ని దరఖాస్తుల పరిశీలన అనంతరం.. కొత్త కార్డుల జారీపై ప్రభుత్వం దృష్టిసారించనుంది.

ఇదీ చూడండి: New Ration cards: పది రోజుల్లోగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.