అమలు దిశగా ఎన్నికల హామీలు....
గతంలో ఇచ్చిన రూ. 1000 ఫించన్‌ను రూ. 2016 కు పెంచారు. దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పింఛన్‌ను రూ.1500 నుంచి రూ.3016 కు పెంచారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను నియోజకవర్గాల వారీగా లబ్దిదారులకు ఈ నెల 20వ తేదీన అందిస్తారు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గిస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వీలైనంత త్వరగా లబ్ధిదారుల జాబితా రూపొందించి పింఛన్ అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అటు బీడీ కార్మికుల భవిష్యనిధి కటాఫ్ తేదీని తొలగించారు. ఈ నెల 17 వరకు భవిష్యనిధి ఖాతా ఉన్న బీడీకార్మికులకు పింఛన్ అందించాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.
నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ...
ఉత్తర్వుల ప్రక్రియ ముగిశాక పింఛన్ మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాల్లో జమచేస్తారు. పింఛన్లు పెంచిన దృష్ట్యా ఏటా రూ.12వేల కోట్లు ఖర్చు కానుంది. ఇందులో రూ.11వేల 800కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండగా... రూ. 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం అందించనుంది.
ఇవీ చూడండి: తవ్వేకొద్దీ తెలుస్తోంది... అవినీతిలోతు..!