కొత్త పురపాలక చట్టం స్వల్ప సవరణతో గవర్నర్ ఆమోదం పొంది అమల్లోకి వచ్చింది. ఉభయసభలు ఆమోదించిన బిల్లులో గవర్నర్ ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. ఈ మేరకు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. పట్టణ ప్రాంత స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలను రాష్ట్ర ప్రభుత్వం సూచించేలా బిల్లులో పొందుపర్చారు. దీనిపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ అంశాన్ని తొలగించి చట్టసవరణ చేశారు. ఒక సవరణతో కొత్త పురపాలక చట్టం గవర్నర్ నరసింహన్ ఆమోదం పొందింది. చట్టం బిల్లు, చట్టసవరణ ఆర్డినెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విధివిధానాలు ప్రకటించనుంది.
ఇవీ చూడండి: వారసత్వ కట్టడాల రక్షణ గందగోళంగా ఉంది: హైకోర్టు