ETV Bharat / state

బ్యాటరీతో పనిచేసే ట్రాక్టర్​ను చూశారా?

ఇప్పటి వరకు బ్యాటరీతో పనిచేసే కార్లు, బైకులు, ఆటోలను చూశామే కానీ బ్యాటరీతో పనిచేసే ట్రాక్టర్​ని చూశారా!... వ్యవసాయరంగంలో కీలక పాత్ర పోషించే ట్రాక్టర్లను ప్రతి రైతుకి తక్కువ ఖర్చుకు అందించే విధంగా 'సెల్‌ఈస్టైల్‌ ఈ-మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ' దేశంలో మొట్టమొదటి సారిగా బ్యాటరీతో నడిచే గ్రీన్​మొబిలిటీ ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తయారు చేసిన ఈ-మొబిలిటీ ట్రాక్టర్​ విశేషాలు తెలుసుకుందామా..!

new electric tractor invented by cellestyle e mobility private limited in Hyderabad
బ్యాటరీతో పనిచేసే ట్రాక్టర్​ను చూశారా?
author img

By

Published : Mar 16, 2020, 6:02 AM IST

బ్యాటరీతో పనిచేసే ట్రాక్టర్​ను చూశారా?

వ్యవసాయ రంగంలో రైతులు వినియోగిస్తున్న డీజిల్ ట్రాక్టర్లకు ప్రత్యామ్నాయంగా ఈ-మొబిలిటీ ట్రాక్టర్ అందుబాటులోకి వచ్చింది. కేవలం విద్యుత్ ఛార్జీ తప్ప మరే ఇతర ఖర్చు లేకుండా పూర్తిగా బ్యాటరీ సాయంతో ఈ గ్రీన్‌మొబిలిటీ ట్రాక్టర్‌ను రైతులు వినియోగించుకోవచ్చు. ఇంటా బయటా బహుళ ప్రయోజనాలు గల పర్యావరణహిత, కాలుష్య రహిత ట్రాక్టర్‌ను "సెల్‌ఈస్టైల్‌ ఈ-మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ" హైదరాబాద్‌లో లాంఛనంగా విడుదల చేసింది. ఈ ట్రాక్టర్​ సాయంతో దుక్కిదున్నడం, విత్తనాలు విత్తడం, రసాయనాలు, క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడానికే కాకుండా పనులకు కూడా వినియోగించుకోవచ్చని ఆ సంస్థ నిర్వాహకులు పేర్కొంటున్నారు.

తక్కువ ధరే..

21 హెచ్‌పీ సామర్థ్యం గల బ్యాటరీతో పనిచేసే ఈ ట్రాక్టర్‌ ఖరీదు రూ. 5 లక్షలుగా నిర్ణయించామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఒకసారి విద్యుత్ లేదా సౌరశక్తితో రీఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తుందని ప్రకటించింది.

స్మార్ట్‌ అగ్రికల్చర్‌లో భాగంగా పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు తాము ఆవిష్కరించిన ఈ-ట్రాక్టర్ బాగా ఉపయోగపడుతుందని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. రాబోయే ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో తమ ట్రాక్టర్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

దేశంలో మొట్టమొదటి సారిగా బ్యాటరీతో నడిచే ఈ ట్రాక్టర్లను రూపొందించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని సంస్థ నిర్వాహకులు అంటున్నారు. రైతన్నలకు సాయపడే విధంగా ఉన్న ఈ ట్రాక్టర్లు వ్యవసాయానికి ఎంతగానో తోడ్పడతాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్​: కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.