ETV Bharat / state

రాష్ట్రంలో 2 వేలకు చేరువలో కరోనా కేసులు - corona cases total

new corona cases and deaths in telangana
రాష్ట్రంలో మరో 1,914 కరోనా కేసులు, 5 మరణాలు
author img

By

Published : Apr 7, 2021, 9:33 AM IST

Updated : Apr 7, 2021, 11:33 AM IST

09:25 April 07

రాష్ట్రంలో మరో 1,914 కరోనా కేసులు, 5 మరణాలు

రాష్ట్రంలో మరోమారు కొవిడ్‌ పంజా విసురుతోంది. గతం కంటే వేగంగా, ప్రమాదకరంగా వ్యాపిస్తోంది. గడచిన 24గంటల్లో 74వేల274మందికి వైరస్‌ నిర్ధరణ పరీక్షలు చేయగా.. ఏకంగా 19వందల14 మందికి మహమ్మారి సోకిందని తేలింది. మరో 3వేల202మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. తాజాగా వచ్చిన కేసులు కలిపి ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 3లక్షల16వేల649కి చేరింది. 285మంది కోలుకోగా 3లక్షల3వేల298 మంది బయటపడ్డారు. కరోనాతో మరో ఐదుగురు మృతి చెందగా .. వైరస్ మరణాల సంఖ్య రాష్ట్రంలో 17వందల34కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా క్రియాశీల కేసుల 11వేల617 ఉన్నాయి. 6వేల634మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 393 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 205, నిజామాబాద్‌లో 179, రంగారెడ్డిలో 169, నిర్మల్‌ జిల్లాలో 104 కేసులు వెలుగు చూశాయి. జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు.. నిజామాబాద్, నిర్మల్‌లలో రోజురోజుకూ కరోనా కేసులు రెట్టింపు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

పరీక్షలను పెంచిన ప్రభుత్వం

వైరస్‌ను కట్టడి చేసేందుకు కరోనా నిర్ధరణ పరీక్షలను పెంచిన ప్రభుత్వం.. కాంటాక్టైన వ్యాక్తులకు వేగంగా గుర్తించి పరీక్ష చేయించుకునేలా ప్రత్యేకంగా యాప్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో వేగంగా వైరస్ వెలుగు చూస్తున్న ప్రాంతాల్లో మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకోసం ప్రత్యేకంగా పడకలను ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది. తగినన్ని ఆక్సిజన్ పడకలు, వెంటిలేటర్లను అందుబాటులోకి తెస్తోంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ కొవిడ్ రోగుల కోసం 50 శాతం పడకలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా కార్యాలయాల్లోనే కరోనా వ్యాప్తి చెందుతుందని గుర్తించిన ఆరోగ్య శాఖ .. పనిచేసే చోట గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించింది. మాస్కులు, శానిటైజర్ల వినియోగంతోపాటు భౌతికదూరం పాటించాలని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో 45ఏళ్లు పైడిన వారిలో 13లక్షల 37వేల 948మందికి తొలిడోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. 2 లక్షల 70వేల 822మంది రెండో డోస్‌ తీసుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అర్హున ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా కొరోనా నుంచి కొంత వరకు బయటపడవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

Last Updated : Apr 7, 2021, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.