ETV Bharat / state

వైరల్ వీడియో.. బెట్టింగ్ వివాదం కాదు: పోలీసులు - నెల్లూరు వైరల్ వీడియోలపై డీఎస్పీ కామెంట్స్

ఏపీలోని నెల్లూరులో ఓ యువకుడిని చితకబాదిన వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనకు క్రికెట్​ బెట్టింగ్ కారణమని తొలుత వార్తలు వచ్చినా.. అది నిజం కాదని పోలీసులు తేల్చారు. ఆర్థిక లావాదేవీల వివాదం కారణంగా యువకుడిపై దాడి జరిగిందని పేర్కొన్నారు. వైరల్ అయిన వీడియోలు గతేడాది నవంబర్, ఈ ఏడాది ఏప్రిల్​లో జరిగినట్లు స్పష్టం చేశారు.

ap betting news
వైరల్ వీడియో.. బెట్టింగ్ వివాదం కాదు: పోలీసులు
author img

By

Published : Nov 17, 2020, 10:56 PM IST

వైరల్ వీడియో.. బెట్టింగ్ వివాదం కాదు: పోలీసులు

నెల్లూరులో ఓ యువకుడిని కర్రలతో చితకబాదిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంతోనే ఈ దాడి జరిగినట్లు వార్తలు రావడంతో విచారించిన పోలీసులు అలాంటిదేమీ లేదని తేల్చారు. ఆర్థిక లావాదేవీలతోనే ఈ దాడులు జరిగినట్లు తెలిపారు. వైరల్ అయిన వీడియోలు గతేడాది నవంబర్, ఈ ఏడాది ఏప్రిల్​లో జరిగినట్లు స్పష్టం చేశారు.

దాడికి పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ దాడులకు క్రికెట్ బెట్టింగ్​తో ఎలాంటి సంబంధం లేదని నెల్లూరు పట్టణ, గ్రామీణ డీఎస్పీలు శ్రీనివాసులురెడ్డి, హరినాథ్ రెడ్డిలు తెలిపారు. హోటల్ బిల్లు కట్టలేదని రేవంత్ అనే వ్యక్తిని రాజశేఖర్, రంజిత్​లు గత ఏడాది నవంబర్​లో దాడి చేశారని పోలీసులు తెలిపారు. అద్దెకు తీసుకున్న కారు ప్రమాదానికి గురికావడం, దానికి సంబంధించిన నగదు చెల్లించలేదన్న కారణంతో ఏప్రిల్​లో యుగంధర్ అనే వ్యక్తిని రాజశేఖర్, కిరణ్ అనే వ్యక్తులు కర్రలతో కొట్టినట్లు చెప్పారు.

బాధితులెవ్వరూ ఫిర్యాదు ఇవ్వకపోవడంతో, అప్పట్లో చర్యలు తీసుకోలేకపోయామని, ఇప్పుడు మీడియాలో రావడంతో విచారించి నిందితులపై కేసు నమోదు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామన్నారు.

స్పందించిన డీజీపీ

నెల్లూరు వైరల్ వీడియోలపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఈ ఘటనలపై విచారించాలని గుంటూరు రేంజ్ డీఐజీ, ఎస్పీలను ఆదేశించారు. దాడి ఘటనలు గత ఏడాది నవంబరు, ఈ ఏడాది ఏప్రిల్ నాటివిగా గుర్తించినట్లు తెలిపారు. దాడి చేసిన నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలపై వెంటనే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇవీచూడండి: వైరల్: బెట్టింగ్ పైసలివ్వలేదని కర్రతో చితకబాదిండు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.