రాష్ట్రంలో కొత్తగా నీరా విధానం తీసుకొస్తున్నట్లు ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ ప్రకటించారు. ఈ విధానానికి సంబంధించి ముఖ్యమంత్రి సంతకం కూడా చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో నమూనా స్టాల్ ఒకటి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అయిదారు నెలల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. 40 లక్షల మంది గౌడ కులస్థులకు ప్రయోజనం చేకూర్చే ఈ విధానం ద్వారా నేరుగా మూడు లక్షల మంది గీత కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గీత కార్మికులపై గతంలో ఆంక్షలు విధించడమే తప్ప...సంక్షేమ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమంతోపాటు వృత్తిని కాపాడడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. ఔషధ గుణాలు కలిగిన నీరాను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు.
ఇవీచూడండి: మద్యం దుకాణాల లైసెన్స్ పొడిగింపు