నేడే లోక్సభ అభ్యర్థుల ఎన్నికల నామపత్రాల పరిశీలన లోక్సభ ఎన్నికల నామపత్రాల పరిశీలన కాసేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో పరిశీలకుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన చేపడతారు. ప్రక్రియ జరిగేటప్పుడు అభ్యర్థి, ఏజెంట్, ప్రతిపాదించిన వ్యక్తితో పాటు మరొకరిని మాత్రమే అనుమతిస్తారు. ఫారం ఏ,బీ సక్రమంగా పూరించి ఉండాలి అలాగే ఫారం 26లో అన్నికాలమ్స్ నింపని నామినేషన్లను తిరస్కరిస్తామని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో 795 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ లో 245, అత్యల్పంగా మెదక్ లో 20 నామపత్రాలు వచ్చాయి.ఇవీ చూడండి:90 దాటితే... బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు!