రహదారి మరమ్మతుల కారణంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డును నెలరోజులపాటు మూసేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. రూ.26 కోట్ల వ్యయంతో చేపట్టిన నెక్లస్ రోడ్ మరమ్మతు పనులను సత్వరమే పూర్తి చేయాలంటే ఇరువైపులా మూసేయక తప్పదన్నారు. సిబ్బంది సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
వీడీసీసీ పనుల పరిశీలన..
బుద్ద పూర్ణిమ ప్రాజెక్టులో భాగంగా నెక్లస్ రోడ్, ట్యాంక్ బండ్, లుంబిని పార్క్ పరిసరాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలో నెక్లస్ రోడ్లోని జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు వద్ద చేపట్టిన వీడీసీసీ రోడ్డు పనులను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ నెక్లస్ రోడ్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రికి వివరించారు.