ETV Bharat / state

NCRB : 'ఆన్​లైన్​ పిటిషన్‌లను ఎఫ్‌ఐఆర్‌లుగా మార్చడంలో తెలంగాణ నంబర్ వన్'

author img

By

Published : Aug 31, 2022, 12:48 PM IST

Telangana DGP on NCRB Report 2022 : సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా నిరోధించడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదైనప్పటికీ, సమర్థంగా పనిచేయడం వల్లే బాధితులకు తగిన న్యాయం జరుగుతోందని డీజీపీ కార్యాలయం వెల్లడించింది.

Telangana Police
తెలంగాణ పోలీసులు

Telangana DGP on NCRB Report 2022: రాష్ట్రంలో ఫిర్యాదులు అందిన వెంటనే ఎఫ్ఐఆర్​లు చేయడంతో పాటు.. బాధితులకు న్యాయం జరిగేలా చూడటంలో రాష్ట్రం ముందు వరుసలో ఉన్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక చెబుతోందని ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రంలో రూ.26 కోట్లకుపైగా నగదును సైబర్ మోసగాళ్ల చేతిలో పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.

అంతర్జాల వినియోగం పెరగడంతో.. చాలా మంది డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకొని సైబర్ నేరగాళ్లు పలు మోసాలకు పాల్పడుతున్నారు. అమాయాకులను నమ్మించి బ్యాంకు ఖాతాల్లో నగదు కొల్లగొడుతున్నారు. ఎక్కడో జార్ఖండ్, బిహార్, పశ్చిమబెంగాల్‌లోని మారుమూల గ్రామాల్లో ఉంటున్న సైబర్ నేరస్థులు.. దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాల నిరోధానికి కేంద్ర హోంశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

పోలీసు శాఖలు, బ్యాంకులు, ఈ కామర్స్ వెబ్ సైట్ల మధ్య సమన్వయం కోసం ఇండియన్ సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. సైబర్ క్రైమ్ హెల్ప్‌ లైన్ 1930 తోపాటు, నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్- ఎన్​సీఆర్​పీని ఏర్పాటు చేసింది. సైబర్ నేరాలను సులభంగా, వేగంగా నమోదు చేసేందుకు 2021 జూన్‌లో రాష్ట్రంలో పోర్టల్‌తోపాటు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1930ని ప్రారంభించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

సైబర్ నేరాల నమోదు కేంద్రం పనితీరును అన్ని రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ క్రమం తప్పకుండా సమీక్షిస్తోందని.. ఈ పోర్టల్‌లో నమోదైన ఆన్‌లైన్ ఫిర్యాదులను ఎఫ్ఐఆర్​లుగా మార్చాలని ఆదేశాలు జారీ చేసినట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. రికవరీ చేసిన డబ్బును తిరిగి బాధితులకు చెల్లించడంతోపాటు నేరస్థులను న్యాయస్థాన పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.

రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ మార్పిడి శాతం 17.52శాతంతో దేశంలోనే అత్యుత్తమంగా ఉంది. ఎఫ్ఐఆర్​ల నమోదు, నేరస్థులను అరెస్టు చేయడం, చోరీ అయిన డబ్బును రికవరీ చేయడం.. బాధితులకు న్యాయం చేసే అవకాశం ఏర్పడిందన్నారు. దేశంలోనే రాష్ట్ర పోలీసు శాఖ ఆన్‌లైన్‌ పిటిషన్‌లను ఎఫ్ఐఆర్​లుగా మార్చడంలో మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపింది. యూపీలో 2.2 లక్షల సైబర్ నేరాల ఫిర్యాదులు రాగా.. 1432 ఎఫ్ఐఆర్​లు నమోదు చేశారని.. దిల్లీలో 1.4 లక్షల ఫిర్యాదులు రాగా 3,919 ఎఫ్ఐఆర్​లు మాత్రమే నమోదు చేసినట్లు గణాంకాలు వెల్లడించింది.

తెలంగాణలో 80వేల ఫిర్యాదులు రాగా దేశంలోనే అత్యధికంగా 14,135 ఎఫ్ఐఆర్​లు నమోదు చేశామని.. ఇది 17.52 శాతంగా ఉందని డీజీపీ కార్యాలయం తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి రూ.116 కోట్లు ఆపగలిగితే.. రాష్ట్రంలో రూ.26.6 కోట్లు ఆపామని ఉన్నతాధికారులు తెలిపారు. సైబర్ నేరాలు, నేరస్థులను ట్రాక్ చేయడానికి తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన సైక్యాప్స్ అనే సాఫ్ట్‌వేర్‌ను దేశంలోని 25 రాష్ట్రాలు ఉపయోగిస్తున్నాయని పేర్కొంది. ఈ అప్లికేషన్‌కు తెలంగాణ పోలీసు కేంద్ర ప్రభుత్వ మొదటి బహుమతిని దక్కించుకుందని పేర్కొన్నారు.

వ్యభిచారం, లైంగిక దోపిడీ, వెట్టిచాకిరీ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీసులు పక్కాగా కేసులు నమోదు చేస్తుననట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ తరహా కేసులను నమోదు చేయడంలో తెలంగాణ ముందంజలో ఉందని.. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో మానవ అక్రమ రవాణా నిరోదక బృందాలను ఏర్పాటు చేసి పక్కాగా పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. గతేడాది రాష్ట్రంలో 347 కేసులు నమోదు చేసి 480 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

మానవ అక్రమ రవాణా నిరోధించడానికి రాష్ట్ర పోలీసులు తీసుకుంటున్న చర్యలను కేంద్ర హోంశాఖ ప్రశంసించినట్లు డీజీపీ కార్యాలయం వెల్లడించింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ విధానాలు అమలు చేసేందుకు కేంద్ర హోంశాఖ రాష్ట్రాన్ని నివేదిక కోరినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.