ETV Bharat / state

ఏవోబీలో ఎదురుకాల్పులు... మావోయిస్టు మృతి

ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో మరోసారి తుపాకీ గర్జించింది. ఆదివారం తెల్లవారుజామున మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మరణించినట్లు సమాచారం.

naxal-killed-in-an-encounter-at-aob
ఏవోబీలో ఎదురుకాల్పులు... మావోయిస్టు మృతి
author img

By

Published : Jul 26, 2020, 9:29 AM IST

ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో వారం తిరగకుండానే మరోసారి తూటాలు పేలాయి. మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించినట్లు తెలుస్తోంది. ఒడిశాలోని మల్కాన్​గిరి జిల్లా సరిహద్దు గుజ్జెడికి సమీపంలో కాల్పులు జరిగాయని తెలుస్తోంది. ఈ ఘటనలో మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్నట్లు సమాచారం.

విశాఖ మన్యం సమీపంలో ఈ నెలలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరగడం ఇది మూడో సారి. ఈ నెల 16 న ఒడిశా సరిహద్దుల్లో, ఈ నెల 19న విశాఖ మన్యం గిన్నెలకోట పంచాయతీ లండుల అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. జులై 28 నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఉన్నందున ఎదురు కాల్పుల ఘటనలకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఇదీ చదవండి: మంచు శిఖరంపై మరపురాని విజయానికి 21 వసంతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.