సవాళ్లను అధిగమించేలా క్షిపణుల తయారీ ఉండాలని తూర్పు నావికాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్‌అడ్మిరల్ బిశ్వజిత్‌దాస్ గుప్తా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం తూర్పు నౌకాదళంలో ఐఎన్‌ఎస్ కళింగలో శుక్రవారం జరిగిన ‘క్షిపణి సాంకేతిక బదిలీ- అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై సాగిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. రక్షణ వ్యవస్థలో భారతీయ నౌకాదళం ఓ ఆయుధశాల ఉంటూ... క్షిపణుల తయారీ, రూపల్పన, నిర్వహణ, ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
నూతన సాంకేతిక పరిజ్ఞానంతో క్షిపణుల తయారీ ప్రక్రియలో నేవీతో పాటు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), ఇతర రక్షణ సంస్థలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. తొలుత ఐఎన్‌ఎస్ కళింగ కమాండింగ్ అధికారి కమొడోర్ నీరజ్‌ఉదయ్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. సదస్సులో నౌకాదళం, డీఆర్డీవో, రక్షణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: దిల్లీ ఎయిమ్స్‌కు రాష్ట్రపతి కోవింద్!