హైదరాబాద్లో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వనస్థలిపురం ప్రశాంత్ నగర్లోని శ్రీ కనకదుర్గ దేవాలయంలో12వ వార్షికోత్సవంలో భాగంగా నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వార్షికోత్సవాలు 25 వరకు జరుగుతాయని ఆలయ కమిటీ ఛైర్మన్ భుజంగారెడ్డి తెలిపారు.
కరోనా నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను చేశామని పేర్కొన్నారు. కొవిడ్, భారీ వర్షాల నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: 'రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు'