హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ పాఠశాలలో యోగా నేచురోపతి క్యాంప్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. సంజీవిని వెల్నెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. నేచురోపతికి మంచి రోజులు వస్తాయని, ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. భారతీయ మూలలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. యాంత్రిక జీవన విధానానికి అలవాటు పడి బంధాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటి పెద్దలు ఉండాలి..
ఉమ్మడి కుటుంబాలు అంతరించి పోతున్నాయని, పిల్లలకు మార్గదర్శకాలు చేయడానికి ఇంటి పెద్దలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నేచురోపతి మన భారతీయ వైద్యమని, ఈవైద్యం నాకెంతో ఇష్టమన్నారు. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. 65 శాతం రోగాలు ఒత్తిడి వల్లే వస్తున్నాయన్నారు. నేచురోపతికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : మద్యం మత్తులో హైటెన్షన్ పోల్ ఎక్కి హల్చల్