ఎన్ఎంసీ బిల్లును అమల్లోకి తీసుకురావటం ద్వారా కేంద్ర ప్రభుత్వం... దేశంలో వైద్యవిద్యను చీకట్లోకి నెట్టేసిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా 24 గంటలపాటు వైద్య సేవల బంద్కు పిలుపునిచ్చింది. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి గురువారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా.. ఇతర వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ ప్రకటించింది. బిల్లు అమల్లోకొస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోతుందని ఐఎంఏ తెలంగాణ విభాగం ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: ఎన్ఎంసీ బిల్లు అతిపెద్ద సంస్కరణ: హర్షవర్ధన్