మత ప్రాతిపదికన కాకుండా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయుటకై.. ప్రత్యేక చట్టం రూపొందించాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల అమలుకు తక్షణమే జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు.
ఆగ్రవర్ణాలలోని నిరుపేదలకు..
గత ఏడు దశాబ్దాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందక , ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాక ఆగ్రవర్ణాలలోని నిరుపేదలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోందన్నారు. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడమంటే ఇతరవర్గాల రిజర్వేషన్లను వ్యతిరేకించడం కాదని.. పేదరికం ప్రాతిపదికన ఇచ్చే అంశంగా పరిగణించాలన్నారు.
సమాఖ్య ఆధ్వర్యంలో..
కేంద్రం కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేయాలన్నారు. లేకుంటే ఈ నెల 15న వేలాది మందితో ప్రగతిభవన్ ఎదుట నిరసన తెలియజేస్తామన్నారు. మార్చి 21న లక్షలాది మందితో సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఓసీల కదనభేరి సభను భారీ ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు
ఇదీ చదవండి:ప్రజాప్రతినిధుల కేసులపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు