ETV Bharat / state

గెస్ట్ టీచర్లను క్రమబద్ధీకరించాలి: ఆర్. కృష్ణయ్య

తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఛైర్మన్ నీల వెంకటేశ్​ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్ లో నిర్వహించిన మహాసభలో ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు. అంతకుముందు ఇందిరా పార్కు వద్ద పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం వల్ల బషీర్​బాగ్​లో భారీ ర్యాలీ నిర్వహించారు.

author img

By

Published : Jan 3, 2021, 3:37 PM IST

గెస్ట్ టీచర్లను క్రమబద్ధీకరించాలి: ఆర్. కృష్ణయ్య
గెస్ట్ టీచర్లను క్రమబద్ధీకరించాలి: ఆర్. కృష్ణయ్య

బీసీ గురుకుల పాఠశాల గెస్ట్ టీచర్లను క్రమబద్ధీకరించి... రూ. 14వేల నుంచి 24వేలకు వేతనాలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఛైర్మన్ నీల వెంకటేశ్​ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్ నిర్వహించిన మహాసభలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఇందిరా పార్కు వద్ద పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం వల్ల బషీర్​బాగ్​లో భారీ ర్యాలీ నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా బీసీ గురుకుల పాఠశాలలో పనిచేసే 2,200 మంది గెస్ట్ టీచర్లు అనే పదాన్ని తీసివేసి కాంట్రాక్టు ఉద్యోగులుగా మార్చాలని ఆర్. కృష్ణయ్య, వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఆన్​లైన్ తరగతుల బాధ్యత అప్పగించిన ప్రభుత్వం... వేతనాల బకాయిలు చెల్లించకుండా వీరి పట్ల నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. టీచర్లకు ఉన్న అన్ని విద్యార్హతలు ఉన్నాయని... 10 ఏళ్లుగా పనిచేస్తున్న బోధన అనుభవం ఉన్నప్పటికీ... ఎందుకు క్రమబద్ధీకరించడం లేదని ప్రశ్నించారు.

తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఎనిమిది నెలలు రెగ్యులర్​గా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని... ఈ ప్రకారం వీరిని తక్షణమే క్రమబద్ధీకరించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇవీచూడండి: టీకా వినియోగంపై నేడు డీసీజీఐ కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.