ETV Bharat / state

నదుల అనుసంధానంపై మరోసారి జాతీయస్థాయిలో చర్చ..!

Meeting on River Connectivity: నదుల అనుసంధానంపై నేడు చర్చ జరగనుంది. దిల్లీలో జరగనున్న జాతీయ జల అభివృద్ధి సంస్థ, 70వ గవర్నింగ్ బాడీ సమావేశం ఇందుకు వేదికకానుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరగనున్న ఆ సమావేశానికి ఎన్​డబ్ల్యూడీఏ అధికారులతోపాటు అన్ని రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు, ఈఎన్​సీలు పాల్గొంటారు.

Meeting on River Connectivity
Meeting on River Connectivity
author img

By

Published : Nov 15, 2022, 8:13 AM IST

Meeting on River Connectivity: నదుల అనుసంధానంపై నేడు మరోసారి జాతీయస్థాయిలో చర్చ జరగనుంది. దిల్లీలో జరగనున్న జాతీయ జలఅభివృద్ధి సంస్థ, 70వ గవర్నింగ్ బాడీ సమావేశం ఇందుకు వేదికకానుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరగనున్న ఆ సమావేశానికి ఎన్​డబ్ల్యూడీఏ అధికారులతోపాటు అన్ని రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు, ఈఎన్​సీలు పాల్గొంటారు.

69వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, బడ్జెట్, నిర్వహణపర అంశాలు, దేశవ్యాప్తంగా ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధాన ప్రణాళికలు, వాటి పురోగతిని సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి-కావేరీ అనుసంధానానికి సంబంధించి, ఇటీవల తీసుకొచ్చిన ప్రత్యామ్నాయ ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

గోదావరిలో మిగులు జలాలు లేవని, కేంద్ర జలసంఘం తేల్చిన నేపథ్యంలో తనవాటాలో ఛత్తీస్‌ఘడ్ వినియోగించుకోని నీటిని మాత్రమే కావేరికి ఇచ్చంపల్లి నుంచి మళ్లిస్తామని, జాతీయ జలఅభివృద్ధిసంస్థ ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనపై భాగస్వామ్య రాష్ట్రాలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తంచేశాయి. నేడు జరగనున్న సమావేశంలో ఇందుకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 40పనులకు సంబంధించిన అంశాలు సమావేశం అజెండాలో ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.