ETV Bharat / state

NGT On Reservoir Works: ఏపీలోని ఆ మూడు రిజర్వాయర్ల పనులు నిలిపివేయాలి: ఎన్జీటీ

NGT On Reservoir Works : ఏపీలోని చిత్తూరు జిల్లాలో రిజర్వాయర్ల పనులు నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అవులపల్లితో పాటు 3 రిజర్వాయర్ల పనులు నిలిపివేయాలని తెలిపింది.

NGT Stay On AP Projects
NGT On Reservoir Works
author img

By

Published : Feb 14, 2022, 7:11 PM IST

NGT On Reservoir Works: పర్యావరణ నష్టాన్ని అంచనా వేయకుండా ఏపీలోని చిత్తూరు జిల్లాలో రిజర్వాయర్ల పనులు ఎలా చేపట్టారని ఎన్జీటీ పేర్కొంది. అవులపల్లితో పాటు 3 రిజర్వాయర్ల పనులు నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఈ పనులకు సంబంధించి పర్యావరణ అనుమతులు తప్పకుండా తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. తాగునీటి అవసరంతో పాటు పర్యావరణ పరిరక్షణ అంతే అవసరమని వ్యాఖ్యానించింది. పర్యావరణానికి నష్టం వాటిల్లదన్న ఏపీ వాదనలను తోసిపుచ్చింది. పర్యావరణ అనుమతులు పొందాకే ప్రాజెక్టులు ప్రారంభించాలని ఎన్జీటీ ఆదేశించింది.

గాలేరు‌-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులో భాగంగా అదనంగా ఏపీ సర్కార్ ఈ మూడు రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టిందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. గతంలో అనుమతులు పొందిన ప్రాజెక్టుల విస్తరణలో భాగంగానే రిజర్వాయర్లని ఎన్జీటీ దృష్టికి తీసుకొచ్చింది. కొత్త రిజర్వాయర్ల నిర్మాణం వల్ల పర్యావరణ ముప్పు ఉండదని వాదించింది. ఇందుకు స్పందించిన ఎన్టీటీ.. పర్యావరణ ప్రభావం అంచనా వేయకుండా ముప్పు ఉండదని ఎలా చెబుతారని ప్రశ్నించింది. పర్యావరణ అనుమతుల తర్వాతే నిర్మాణం చేపట్టాలని తేల్చి చెప్పింది.

ఇదీ చూడండి : Bandi sanjay Fires on KCR: తర్వాత పీసీసీ అధ్యక్షుడు కేసీఆరే: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.