ETV Bharat / state

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై గ్రీన్​ ట్రైబ్యునల్​ స్టే - తెలంగాణలో నీటి ప్రాజెక్టుల తాజా వార్తలు

stay on pothireddyapadu
పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై గ్రీన్​ ట్రైబ్యునల్​ స్టే
author img

By

Published : May 20, 2020, 11:01 AM IST

Updated : May 20, 2020, 6:21 PM IST

10:59 May 20

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై గ్రీన్​ ట్రైబ్యునల్​ స్టే

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం రేపుతున్న పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్​ విస్తరణకు బ్రేక్​ పడింది. పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వర ఎత్తిపోతలపై నేషనల్​ గ్రీన్​ ట్రైబ్యునల్ (ఎన్​జీటీ) స్టే విధించింది.  ప్రాజెక్టు అధ్యయనానికి నాలుగు శాఖల సమన్వయంతో కేంద్ర కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక వచ్చేవరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించింది.

పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా నారాయణపేట జిల్లాకు చెందిన సర్పంచుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్​ ఎన్​జీటీలో పిటిషన్​ వేశారు. పోతిరెడ్డిపాడుతో రాష్ట్రంలో సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయని పిటిషనర్​ తెలిపారు. జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలో బెంచ్​ విచారించి విస్తరణ పనులపై స్టే విధించినట్లు పిటిషనర్​ తరపు న్యాయవాది తెలిపారు.

Last Updated : May 20, 2020, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.