national best teacher awards 2022: రాష్ట్రానికి చెందిన ముగ్గురికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు లభించాయి. 2022 సంవత్సరానికి గానూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్ర విద్యాశాఖ విభాగం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 46 మంది ఈ అవార్డులకు ఎంపికయ్యారు. అవార్డులకు ఎంపికైన వారిలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు టి.ఎన్.శ్రీధర్, ములుగు జిల్లా అబ్బాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కందాల రామయ్య జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు.
సీబీఎస్ఈ కేటగిరీలో హైదరాబాద్ నాచారం దిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ సునీతారావు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న దిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు.
ఇవీ చూడండి..
ఆ నీళ్లు తాగే దమ్ము కేసీఆర్‌కు ఉందా అంటూ బండి సవాల్
ఆహారం కోసం రైలు దిగిన మహిళపై గ్యాంగ్ రేప్, పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నా