పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి... నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మద్దతు తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నరసింహారావుకి చాలా ఆలస్యంగా గుర్తింపు వచ్చినందుకు బాధపడుతున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే పీవీకి ఇప్పుడు గుర్తింపు వస్తుందన్నారు.
చివరి వరకు ఆయన సేవలు అందించిన పార్టీ సైతం పీవీని విస్మరించిందని... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకపోయినా... ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేకపోయినా పీవీకి సరైనా గౌరవం దక్కేది కాదని సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ బిడ్డలను గౌరవించడంలో కేసీఆర్ ఎల్లప్పుడు ముందుంటారన్నారు. లక్నపల్లిని పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే కేసీఆర్ ప్రతిపాదన పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: దేశంలో ఒక్కరోజే 75 వేల కేసులు-1133 మరణాలు