ETV Bharat / state

Nara Lokesh: 'గుర్తుపెట్టుకోండి.. ఇది ట్రైలర్ మాత్రమే.. పిక్చర్‌ అబీ బాకీ హై' - nara lokesh news

ఏపీలో గంజాయి పరిశ్రమ నడుస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ ధ్వజమెత్తారు. యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని నిలదీస్తే తెదేపా కార్యాలయంపై దాడి చేశారని మండిపడ్డారు. ఎవరూ లేని సమయంలో దాడి చేయడం సరికాదన్న లోకేశ్... దాడులు చేయాలని పోలీసులే ప్రేరేపించే పరిస్థితి వచ్చిందన్నారు.

Nara Lokesh
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్
author img

By

Published : Oct 22, 2021, 6:42 PM IST

ఆంధ్రప్రదేశ్​లో గంజాయి పరిశ్రమ నడుస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని నిలదీస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరూ లేని సమయంలో దాడులు చేయడం సరికాదన్న లోకేశ్... ఆ దాడులను పోలీసులే ప్రేరేపించే పరిస్థితి వచ్చిందన్నారు. పోలీసులు లేకుండా వైకాపా నేతలు బయటకు రావాలన్న ఆయన.. కొన్ని పిల్లులు... పులులమని భావిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

ఏ రాష్ట్రంలో గంజాయి ముఠాను పట్టుకున్నా ఏపీ పేరే చెబుతున్నారని లోకేశ్ అన్నారు. దేశంలో ఏ మూల డ్రగ్స్ పట్టుకున్నా రాష్ట్రంతో లింకు ఉంటుందని ఆరోపించారు. డ్రగ్స్, గంజాయితో ఏపీకి సంబంధం లేదని సీఎం, డీజీపీ చెబుతున్నారు కానీ దేశవ్యాప్తంగా పోలీసు, నిఘా వ్యవస్థలు డగ్స్ హబ్ ఏపీ అంటున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా పోలీసు, నిఘా వ్యవస్థలను విచారణకు పిలుస్తారా? అని లోకేశ్ ప్రశ్నించారు.

-తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

పసుపు జెండా చూస్తే వైసీపీ కార్యకర్తలకు ఎందుకంత భయమని నారా లోకేశ్ ప్రశ్నించారు. ఒక చెంప మీద కొడితే... రెండు చెంపలను వాయగొడతామని హెచ్చరించారు. తమ ఆఫీసు​లో పగిలింది అద్దాలు మాత్రమేనని.. తమ కార్యకర్తల గుండెలను గాయపరచలేరని స్పష్టం చేశారు. రెండున్నరేళ్లు ఆగితే మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ రెడ్డిలా తాను చిన్నాన్న జోలికి వెళ్లలేదన్న లోకేశ్.. ఆ హత్య కేసును త్వరగా తేల్చాలన్నారు. 2024లో మంగళగిరిలో తెదేపాను గెలిపించి కానుకగా ఇస్తానని లోకేశ్ స్పష్టం చేశారు. వైకాపా పార్టీకి ట్రైలర్‌ మాత్రమే చూపామన్న లోకేశ్.. సినిమా ముందుందని పేర్కొన్నారు.

నారాలోకేశ్

ఇదీ చదవండి: CPI narayana: ఆంధ్రప్రదేశ్​లో ప్రమాదంలో ప్రజాస్వామ్యం.. కలిసి పోరాడుదాం: సీపీఐ

Chandrababu: ఖబడ్దార్‌ జాగ్రత్తగా ఉండండి... మీరు సరిదిద్దుకోలేని తప్పు చేశారు: చంద్రబాబు

YCP MP Vijayasai Reddy: మాదక ద్రవ్యాలకు పురుడు పోసింది తెదేపానే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.