ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఎస్సీ కులానికి చెందిన మహిళా ఎస్ఐపై చేసిన వ్యాఖ్యలను మహిళా, ట్రాన్స్ జండర్ సంఘాల ఐకాస తీవ్రంగా ఖండించింది. స్త్రీని, కులాన్ని, లింగాన్ని ఉద్దేశించి రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు రోజు రోజుకు శ్రుతిమించిపోతున్నాయని ఐకాస నాయకురాళ్లు హైదరాబాద్లో ఆందోళన వ్యక్తం చేశారు.
ఆత్మకూరులో తెదేపా చేస్తున్న నిరసనలో ఎస్సీ ఎస్ఐ అనురాధపై ఆ వర్గాన్ని కించపరిచే విధంగా నన్నపనేని రాజకుమారి మాట్లాడడం సరికాదన్నారు. ఈ రకమైన అధిపత్య కుల అహంభావాన్ని చూపిస్తున్న వారిని ఆయా పార్టీ నాయకత్వాలు బహిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కూడా నోటి దురుసుతో మాట్లాడారని గుర్తు చేశారు. వెంటనే ఎస్ఐ అనురాధకు క్షమాపణలు చెప్పి పరుష పదజాలాన్ని వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఐకాస డిమాండ్ చేసింది.
ఇవీ చూడండి : 'మూడు లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి భారం కాదా..?'