ETV Bharat / state

Nandini Agasara won Bronze Medal : ఆసియా క్రీడల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థిని.. కాంస్యపతకం కైవసం - జ్యోతి యర్రాజి

Nandini Agasara won Bronze Medal asian games 2023 : చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో తెలంగాణ గురుకుల విద్యార్థిని.. అగసర నందిని సత్తా చాటింది. హెప్టాథ్లాన్​ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణి కావడం విశేషం

Nandini Agasara got Bronze Medal in asian games 2023
Nandini Agasara won Bronze Medal
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2023, 10:25 PM IST

Nandini Agasara got Bronze Medal in asian games 2023 : తెలంగాణ గురుకుల విద్యార్థిని నందిని అగసర.. ఆసియా క్రీడాల్లో(Asian Games2023) కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్​లో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణి అగసర నందిని.. హెప్టాథ్లాన్‌లో కాంస్య పతకాన్ని సాధించారు. నందిని సంగారెడ్డిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలో బీబీఏ రెండో సంవత్సరం విద్యనభ్యసిస్తున్నారు.

Asian Games 2023 : అతి పెద్ద క్రీడా సంబరానికి వేళాయే.. నీరజ్​తో పాటు ఈ అథ్లెట్లపైనే ఆశలు

Gurukula Student Bronze Medal in asian games 2023 : నార్సింగిలోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుకున్నారు. నందిని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ అథ్లెటిక్స్ అకాడమీ మొదటి బ్యాచ్ విద్యార్థిని కావడం విశేషం. తండ్రి ఎల్లయ్య చాయ్​ అమ్ముతూ తన కూతురు నందినిని గురుకుల పాఠశాలలో చేర్పించారు. నందిని విద్యలో రాణిస్తూనే.. క్రీడారంగంపై ఆసక్తి పెంచుకున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆసియా క్రీడలకు ఎంపిక అయినట్లు నందిని కుటుంబసభ్యులు తెలిపారు.

నందిని వివిధ అంతర్జాతీయ వేదికల్లో నిరంతరం తన అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగిస్తూనే ఉన్నారు. గురుకుల విద్యార్థిని నందిని ఆసియా క్రీడాల్లో కాంస్య పతకం సాధించడం పట్ల రాష్ట్ర సంక్షేమశాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, టీఎస్డబ్ల్యూఆర్​ఈఐఎస్ సెక్రటరీ డాక్టర్ నవీన్ నికోలస్, గురుకుల విద్యా సంస్థల సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

Jyothi Yarraji got Silver Medal in asian games 2023 : మరోవైపు తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి 100 మీటర్ల హర్డిల్స్​లో రజత పతకం గెలుచుకున్నారు. మొదట 100 మీటర్ల హర్డిల్స్​లో కాంస్య పతకం దక్కగా.. ఆ తర్వాత దాన్ని సిల్వర్​ మెడల్​కు మార్చారు. మొదట రేసులో చైనాకు చెందిన వు యన్నీ.. పరుగు ప్రారంభం కావడానికి క్షణం ముందే పరుగు ప్రారంభించింది. అదే సమయంలో యన్నీకి ఎడమవైపు ఉన్న జ్యోతి కూడా పరుగు మొదలుపెట్టింది. దీంతో ఫాల్స్​ స్టార్ట్​గా పరిగణించి వీరిద్దరి రేసు నుంచి తప్పించారు.

కానీ జ్యోతి ససేమిరా అనడంతో నిర్వాహకులతో చాలా సేపు పెద్ద చర్చే జరిగింది. అనంతరం సుదీర్ఘ చర్చల తర్వాత పోస్ట్ రేస్​ రివ్యూ పద్ధతిలో జ్యోతి, వును రేసులో పాల్గొనేందుకు అనుమతించారు. అప్పుడు జ్యోతి మూడో స్థానంతో రేసును ముగించింది. 12.91సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని బ్రాంజ్​ మెడల్​ను ఖరారు చేసుకుంది. అయితే ఈ రేసు పూర్తైన తర్వాత కూడా వీరి 'ఫాల్స్ స్టార్ట్' వీడియోను క్షుణ్ణంగా సమీక్షించగా.. చైనీస్ ప్లేయర్​ వుది 'ఫాల్స్ స్టార్ట్' అని తేలింది. జ్యోతిది తేలలేదు. దీంతో వుపై అనర్హత వేటు వేశారు. జ్యోతిని రజత పతకంతో సత్కరించారు.

Asian Games 2023 : ఆసియా గేమ్స్​లో తెలుగు తేజాలు.. గోల్డ్​ మెడల్​ టార్గెట్​గా బరిలోకి!

Asian Games 2023 : ఆసియా క్రీడల్లో పతకాల వేట షురూ.. భారత్​ ఖాతాలోకి మెడల్స్ వెల్లువ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.