ETV Bharat / state

'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. నందకుమార్‌ లీలలెన్నో..!

MLAs Poaching Case Update: ఎమ్మెల్యే ఎర కేసులో ఊహించని ట్విస్ట్​లు చోటుచేసుకుంటున్నాయి. ఎటువైపు నుంచి ఎటు వెళుతుందో అర్థం కావడం లేదు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తాజాగా సోమవారం నందకుమార్‌ సతీమణి చిత్రలేఖ, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు విజయ్‌కుమార్‌ను బంజారాహిల్స్‌ పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో సిట్‌ వేర్వేరుగా విచారించింది. ఈ క్రమంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

MLAs Poaching Case Updat
MLAs Poaching Case Updat
author img

By

Published : Nov 29, 2022, 7:58 AM IST

MLAs Poaching Case Update: దిల్లీ స్థాయిలో పరిచయాలున్నాయనీ.. నామినేటెడ్‌ పదవులు ఇప్పిస్తానంటూ గల్లీ నేతలతో బేరసారాలు.. ఏ పని కావాలన్నా చేసిపెడతానంటూ పలువురికి ఆశలు.. ఇవీ నందకుమార్‌ లీలలు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఎమ్మెల్యేల ఎర కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తాజాగా సోమవారం నందకుమార్‌ సతీమణి చిత్రలేఖ, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు విజయ్‌కుమార్‌ను బంజారాహిల్స్‌ పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో సిట్‌ వేర్వేరుగా విచారించింది.

శుక్రవారం మొదటిసారి విచారణకు వచ్చిన చిత్రలేఖ.. సోమవారం ఉదయం 10.30 గంటలకు రెండోసారి న్యాయవాదితో కలిసి హాజరయ్యారు. తొలుత మౌనం వహించినా తర్వాత సిట్‌ అధికారుల ప్రశ్నలకు తొణక్కుండా జవాబులిచ్చారని సమాచారం. గతంలో పలుమార్లు సింహయాజి, రామచంద్రభారతి తమ నివాసానికి వచ్చారని ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరితోపాటు దిల్లీ నుంచి ఎవరైనా వచ్చారా అన్న ప్రశ్నకు గుర్తులేదంటూ సమాధానం దాటవేశారని తెలిసింది.

కొన్ని సెల్‌ఫోన్లు పాడయ్యాయని.. మరికొన్ని కనిపించటం లేదంటూ చెప్పారు. నందకుమార్‌ తన వ్యాపార కార్యకలాపాలు, ప్రైవేటు పంచాయితీల లావాదేవీల ఛాటింగ్‌తో ఫొటోల స్క్రీన్‌షాట్‌లను తన భార్య వాట్సప్‌ నంబర్‌కు షేర్‌ చేసేవాడు. వాటి గురించి చిత్రలేఖను సిట్‌ అధికారులు ఆరా తీశారు. నామినేటెడ్‌ పదవులు ఇప్పిస్తామంటూ ఎవరెవరికి హామీలిచ్చారనే అంశంపై ప్రశ్నించారు. సాయంత్రం 6 గంటల వరకు జరిగిన విచారణలో ఆమె చెప్పిన వివరాలను నమోదు చేశారు.

నందకుమార్‌తో ఛాటింగ్‌, బ్యాంకు లావాదేవీల వివరాలు దర్యాప్తులో వెలుగుచూడటంతో విజయ్‌కుమార్‌ను సిట్‌ బృందం విచారించింది. శుక్రవారం అతడి నుంచి కొంత సమాచారం సేకరించగా.. సోమవారం మరిన్ని వివరాలు రాబట్టారు. ఇతను గతంలో ఓ జాతీయ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి వద్ద పనిచేశారు. అనంతరం మరో జాతీయ పార్టీ నాయకుడికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు.

ఆ సమయంలోనే నందకుమార్‌తో పరిచయం ఏర్పడింది. జాతీయస్థాయిలో నామినేటెడ్‌ పదవి ఇప్పిస్తానంటూ ఆశ చూపిన నందకుమార్‌ విజయ్‌ నుంచి తన బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయించుకున్నట్టు తెలిసింది. నందకుమార్‌తో జరిగిన ఆర్థిక లావాదేవీలపై సిట్‌ బృందం ఆరా తీసింది. నామినేటెడ్‌ పదవులపై మాట్లాడేందుకు దిల్లీ వెళ్లారా? అక్కడ ఎవర్ని కలిశారు? వారు ఎలాంటి హామీలిచ్చారు? ఇంకా ఎంతమందికి నామినేటెడ్‌ పదవుల ఆశ చూపారనే అంశాలపై విజయ్‌కుమార్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.