ETV Bharat / state

నేడు నుమాయిష్‌ ఎగ్జిబిషన్ ప్రారంభం - ఆ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు - Hyderabad Exhibition 2024

Nampally Numaish Exhibition 2024 : హైదరాబాద్‌లో ఎన్నో ఏళ్లుగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నుమాయిష్‌ ఎగ్జిబిషన్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది.

All India Industrial Exhibition 2024
Nampally Numaish Exhibition 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2024, 9:43 AM IST

నుమాయిష్‌ 2024 ప్రదర్శనకు సర్వం సిద్ధం

Nampally Numaish Exhibition 2024 : భాగ్యనగర ప్రజలకు పర్యాటక అనుభూతితో పాటు వినోదాన్ని పంచే ఆలిండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. నాంపల్లి మైదానంలో ప్రారంభం కానున్న ప్రదర్శనను సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు ఐటీ శాఖమంత్రి శ్రీధర్‌ బాబు ప్రారంభించనున్నారు. 45 రోజుల పాటు కొనసాగే ఈ పారిశ్రామిక ప్రదర్శనలో దేశం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికులు తమ ఉత్పత్తులను పరిచయం చేస్తూ 2400 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రవేశ రుసుం రూ.40 రూపాయలు ఉంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. పోలీసు శాఖ, అగ్నిమాపక, వైద్యారోగ్య, పురపాలకశాఖల సమన్వయంతో పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టినట్లు వివరించారు. స్టాళ్లలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కొవిడ్ దృష్ట్యా ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించి రావాలని సూచించారు. వృద్ధుల కోసం వీల్‌ఛైర్స్‌ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

టీవర్క్స్‌ వేదికగా మేకర్స్‌ ఫెయిర్‌ ఈవెంట్ - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​లో పిల్లల నూతనావిష్కరణలు

Numaish Exhibition 2024 in Nampally Grounds : ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు, ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 వరకు ఎగ్జిబిషన్‌ తెరిచి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. నుమాయిష్‌కు భారీ సంఖ్యలో జనాలు వస్తారన్న అంచనాతో ప్రత్యేకంగా మెట్రో రైళ్లు, బస్సులు నడిపేలాచర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా నగర ప్రజలు ఎగ్జిబిషన్​లో తప్పక మాస్కు ధరించాలని సూచించారు.

అందమైన చేపలు, పలకరించే చిలుకలు - హైటెక్స్​లో సందడిగా పెటెక్స్​ ఆండ్​ కిడ్స్​ ఫెయిర్ షో

"ఎగ్జిబిషన్​లో 2400 స్టాళ్లను ఏర్పాటు చేశాం. దేశం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికులు ఇక్కడ తమ ఉత్పత్తులను పరిచయం చేస్తారు. ఎగ్జిబిషన్​కు​ వచ్చే ప్రజల కోసం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. వృద్ధుల కోసం వీల్‌ఛైర్స్‌ అందుబాటులో ఉంచాం. మాకు పోలీస్ శాఖ, అగ్నిమాపక, వైద్యారోగ్య, పురపాలకశాఖల పూర్తిగా సాయం చేస్తుంది. - హన్మంతరావు, కార్యదర్శి ఎగ్జిబిషన్‌ సొసైటీ

Numaish Traffic Restrictions Hyderabad : నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిగే ‘నుమాయిష్‌’ దృష్ట్యా సోమవారం నుంచి ఫిబ్రవరి 15 వరకు రోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర సీపీ కె.శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

  • సిద్ధి అంబర్‌ బజార్‌, జాంబాగ్‌ల వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లాలి అనుకునే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, భారీ వాహనాలు ఎంజే మార్కెట్‌ వద్ద అబిడ్స్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.
  • పోలీసు కంట్రోల్‌ రూమ్‌, బషీర్‌బాగ్‌ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ జిల్లా, ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి బీజేఆర్‌(బషీర్‌బాగ్‌) కూడలి నుంచి అబిడ్స్‌ వైపు పంపిస్తారు.
  • బేగం బజార్‌ ఛత్రీ నుంచి మాలకుంట వైపు వెళ్లే భారీ, ఇతర వాహనాలు అలాస్కా జంక్షన్‌ నుంచి దారుస్సలాం, ఏక్‌ మినార్‌ మసీదు, నాంపల్లి వైపు వెళ్లాల్సి ఉంటుంది.
  • దారుస్సలాం (గోషామహల్‌ రోడ్డు) నుంచి అఫ్జల్‌గంజ్‌, అబిడ్స్‌ వైపు వెళ్లాలనుకునే డీసీఎం వాహనాలతో సహా భారీ, ఇతర వాహనాలు అలాస్కా జంక్షన్‌ నుంచి బేగంబజార్‌, సిటీ కాలేజీ, నయాపూల్‌ వైపు మళ్లిస్తారు.
  • మూసాబౌలి/బహదూర్‌పుర వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లాలనుకునే ఆర్టీసీ బస్సులతో సహా ఇతర వాహనాలు సిటీ కళాశాల వద్ద నయాపూల్‌, ఎంజేమార్కెట్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికిన తెలంగాణ

హైటెక్స్​ ఎగ్జిబిషన్​లో పెటెక్స్​ షో - ఈ నెల 22 నుంచి 24 వరకు జరగనున్న పెట్​ షో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.