హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. చేప మందు కోసం రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా... ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఆస్తమా బాధితులు తరలివచ్చారు. వీరి కోసం మత్స్యశాఖ లక్షా 60 వేల చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. రేపు సాయంత్రం 6 వరకు నిరంతరాయంగా జరిగే చేప మందు పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: జడ్పీ ఛైర్మన్లకు కేసీఆర్ శుభాకాంక్షలు