ETV Bharat / state

Nampally Court Rejected Sivaram Remand Petition : ప్రవళిక ఆత్మహత్య కేసు నిందితుడిని విడుదల చేసిన కోర్టు.. మళ్లీ అరెస్ట్​ - ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు ఎవరు

Nampally Court Rejected Sivaram Remand Petition : రాష్ట్రంలో వారం రోజులుగా సంచలనం సృష్టిస్తోన్న ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న శివరాం రాథోడ్‌ కోర్టులో లొంగిపోయాడు. నిందితుడు తరుఫు న్యాయవాది మోమో దాఖలు చేయగా.. రిమాండ్​ పిటిషన్​ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. శివరాం జ్యుడీషియల్ రిమాండ్ పిటిషన్‌ను కొట్టేసింది. అయితే చిక్కడపల్లి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని.. పోలీస్​ స్టేషన్​కు తీసుకువెళ్లారు. శనివారం మళ్లీ కోర్టులో హాజరుపర్చనున్నారు.

Nampally Court Rejected Sivaram Remand Petition
Pravallika Murder Case Update
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2023, 6:49 PM IST

Updated : Oct 20, 2023, 10:17 PM IST

Nampally Court Rejected Sivaram Remand Petition : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడుగా ఉన్న శివరాం రాథోడ్‌(Sivaram Rathore) కోర్టులో లొంగిపోయాడు. నిందితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో శివరాం తరుఫు న్యాయవాది మెమో దాఖలు చేశారు. కోర్టులో విచారణ జరిగిన అనంతరం.. శివరాం రిమాండ్​ పిటిషన్​ను ఎలాంటి ఆధారాలు లేనందున నాంపల్లి కోర్టు తిరస్కరించింది. చాటింగ్ ఆధారాలతో రిమాండ్ ఎలా చేస్తారని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. దీంతో పాటు కేసు దర్యాప్తు జరుగుతున్నందున రిమాండ్​ ఇవ్వలేమని కోర్టు(Nampally Court) వెల్లడించింది. కేసు పూర్తి వివరాలు తెలియజేస్తామని శివరాం న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం ప్రవళిక ఆత్మహత్యకు కారణమని శివరాంపై కేసు నమోదు చేసింది. దీంతో కోర్టులోనే శివరాంను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్​ స్టేషన్​కు తరలించారు. శనివారం ఉదయం మళ్లీ కోర్టులో హాజరుపర్చనున్నారు.

Pravalika Suicide Case Accused : ఈ నెల 13న వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక.. హైదరాబాద్​ చిక్కడపల్లిలోని తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె ప్రియుడు శివరాం పెళ్లి చేసుకుంటానని.. మోసం చేయడంతో ప్రవళిక ఆత్మహత్య (Pravalika Suicide Case)చేసుకుందని పోలీసులు వెల్లడించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిక్కడ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఆత్మహత్యపై పోలీసులు మృతురాలి స్నేహితులను ప్రశ్నించారు. శివరాంతో పరిచయం గురించి వారు తెలిపారు. దీంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. మరోవైపు ప్రవళిక చనిపోయినప్పటి నుంచి శివరాం కనిపించకపోవడం కూడా వారి అనుమానాలను ఎక్కువ అయ్యాయి. ఆమె సెల్​ఫోన్​లోని వాట్సప్ చాట్, డేటా రికవరీ చేసి శివరాం వేధింపుల వల్లే చనిపోయిందని నిర్థరణకు వచ్చారు. ఇదే విషయాన్ని ప్రవళిక కుటుంబ సభ్యులు కూడా రెండు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి వివరించారు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని కోరారు.

Pravalika Suicide Accused Shivaram Arrest : ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం అరెస్ట్

Pravalika Family Members Meet KTR : ప్రవళిక(Pravallika) కుటుంబ సభ్యులతో మంత్రి కేటీఆర్​ సమావేశమై.. దీనికి కారణమైన శివరాంను శిక్షిస్తామని, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రవళిక సోదరుడుకు ఉద్యోగం కూడా ఇస్తామని తెలిపారు. పోలీసులు శివరాం కోసం గాలింపు ముమ్మంర చేయడంతో.. ఇవాళ న్యాయస్థానం ముందు శివరాం లొంగిపోయాడు. అయితే ఎలాంటి ఆధారాలు లేనందున నాంపల్లి కోర్టు శివరాం రిమాండ్​ పిటిషన్​ను తిరస్కరించింది. కేసు పూర్తి వివరాలు తెలియజేస్తామని శివరాం తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు పోలీసులు విచారణ పేరుతో తమను వేధిస్తున్నారని శివారం తరపు బంధువులు.. ఇవాళ మానవ హక్కుల సంఘంలో పిటిషన్ దాఖలు చేశారు. శివరాం ఆచూకీ తెలపాలంటూ వేధించారని వారు ఫిర్యాదులో పాల్గొన్నారు.

Family Members Reaction on Pravalika Suicide : 'శివరామ్ వల్లే ప్రవళిక చనిపోయిందన్న కుటుంబసభ్యులు.. చిక్కడపల్లి పీఎస్​లో కేసు నమోదు'

KTR Reacts on Pravaika Incident : ప్రవళిక మరణంపై స్పందించిన కేటీఆర్.. కుటుంబ సభ్యులను ఆదుకుంటామన్న మంత్రి

Pravallika Last Rites Complete : అశ్రునయనాల మధ్య ప్రవల్లికకు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు

Last Updated : Oct 20, 2023, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.