ETV Bharat / state

మోహిత్​కు ఒకరోజు కస్టడీ.. బయటపడనున్న డ్రగ్స్ సరఫరాదారుల బండారం..! - నాంపల్లి కోర్టు

Nampally Court Allows One Day Custody Of Drug Smuggler Mohit: డ్రగ్స్​ సరఫరాదారుడు మోహిత్​ను ఒకరోజు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మోహిత్​కు ఎంతో మంది ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గతేడాది ఎడ్విన్​ను అరెస్టు చేయడంతో ఇతగాడి బండారం బయటపడింది. మరోవైపు కృష్ణ కిశోర్​కు కోర్టు బెయిల్​ మంజూరు చేసింది.

Drug Smuggler Mohit
డ్రగ్స్​ స్మగ్లర్​ మోహిత్​ అరెస్టు
author img

By

Published : Jan 4, 2023, 7:20 PM IST

Nampally Court Allows One Day Custody Of Drug Smuggler Mohit: మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడిన మోహిత్​ను ఒక రోజు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో రాంగోపాల్ పేట్ పోలీసులు మోహిత్​ను రేపు ఉదయం 10గంటలకు కస్టడీలోకి తీసుకొని.. సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనున్నారు. మోహిత్​కు దాదాపు 50మంది ప్రముఖులతో పరిచయాలున్నట్లు నార్కోటిక్ విభాగం పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు మోహిత్ సెల్​ఫోన్​లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్​ను సేకరించారు. మోహిత్​ను ప్రశ్నించడం ద్వారా వాళ్లతో అతనికి ఉన్న సంబంధాల గురించి తెలుసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

బాలీవుడ్ నటి నేహ భర్త అయిన మోహిత్ ఇంటర్నేషనల్ డీజే నిర్వాహకుడిగా కూడా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్​లోని పలు పబ్బులలో పార్టీలు ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతేడాది నవంబర్​లో గోవా మాదక ద్రవ్యాల స్మగ్లర్​ ఎడ్విన్​​ను అరెస్ట్ చేసినప్పుడు మోహిత్ బండారం బయటపడింది. ఎడ్విన్ ద్వారా మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసిన మోహిత్ వాటిని పబ్బులలో సరఫరా చేసినట్లు నార్కోటిక్ విభాగం పోలీసులు ఆరోపిస్తున్నారు.

కృష్ణ కిశోర్​కు బెయిల్​ మంజూరు: మోహిత్​ను ప్రశ్నించడం ద్వారా ఈ కేసులో పురోగతి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మోహిత్​తో పాటు పోలీసులకు దొరికిపోయిన స్థిరాస్తి వ్యాపారి కృష్ణ కిశోర్​కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కృష్ణ కిశోర్​ గోవా, ముంబయి, బెంగళూర్ నుంచి మాదక ద్రవ్యాలను తెప్పించుకొని వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో కృష్ణ కిశోర్​ చంచల్ గూడ జైలు నుంచి బయటికి రానున్నారు.

అసలు మోహిత్​ ఎలా దొరికాడు: రాంగోపాల్​పేట్ పీఎస్‌ పరిధిలో నవంబర్ 11 నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు గర్వ్ హరీశ్​ బెలనీ అనే వ్యక్తి 4.5 గ్రాముల ఎండీఎంఏతో దొరికాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారించిగా గోవా డ్రగ్ డాన్ ఎడ్విన్ న్యూన్స్, బాల మురుగన్ పేర్లు బయటకు వచ్చాయి. పక్కా ప్రణాళికతో వీరిని గోవాలో నార్కోటిక్స్​ వింగ్​ పోలీసులు అరెస్ట్‌ చేసి.. వారి నుంచి సేకరించిన సమాచారంతో మరో నిందితుడు మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరాన్ మోహిత్​పై నిఘా పెట్టి.. అరెస్టు చేశారు.

డ్రగ్స్​ సరఫరాదారులతో మోహిత్​కు లింకులు:​ మోహిత్​ డీజే ఈవెంట్లు నిర్వహించి మత్తు పదార్థాలు సరఫరా చేసేవాడు. ఇతనిపై గోవాలో ప్రత్యేక బృందం 10రోజులుగా రిక్కీ నిర్వహించింది. అందినట్లే అంది తృటిలో తప్పించుకున్నాడు. ఇంతలోనే కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో స్మగ్లర్​ మోహిత్​ హైదరాబాద్​ వచ్చినట్లు పోలీసులు.. ఆఖరికి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అతని సెల్​ఫోన్​ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. 50మందికి పైగా సరఫరాదార్లతో మోహిత్‌కు లింకులు ఉన్నట్లు గుర్తించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.