ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నిందితులు తరచూ దిల్లీ ఎందుకు వెళ్లారు?

author img

By

Published : Nov 12, 2022, 8:14 AM IST

The case of Baiting MLAs: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దర్యాప్తులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారనే అభియోగంపై పోలీసులు అరెస్టు చేసిన రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌ల రెండోరోజు శుక్రవారం జరిపిన విచారణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సభ్యులు కీలక సమాచారం సేకరించారు.

the case of baiting MLAs
the case of baiting MLAs

The case of Baiting MLAs: హైదరాబాద్‌ వ్యాపారి నందకుమార్‌పై అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. ఆయన కొన్ని రోజుల కిందట పలుమార్లు దిల్లీకి వెళ్లొచ్చిన వ్యవహారంపై కూపీ లాగారు. తరచూ దిల్లీ వెళ్లాల్సిన అవసరమేంటని, అక్కడ ఎవరెవరిని కలిశారని ఆరా తీశారు. మరో వ్యక్తితో ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన విషయంపై ప్రశ్నించారు. అతడి ఫొటో చూపించి.. భారీమొత్తంలో డబ్బు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని అడిగారు.

అధికారుల ప్రశ్నలకు నందకుమార్‌ పొంతన లేని సమాధానాలివ్వగా, అవి సరైనవి కావని తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలను బట్టి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రామచంద్రభారతి, సింహయాజిలను కూడా ప్రశ్నించి వివరాలు రాబట్టారు. రామచంద్రభారతి సెల్‌ఫోన్‌లోని చాటింగ్‌ల సారాంశంతోపాటు కాంటాక్టు జాబితాలోని వ్యక్తులతో అతడి సంబంధాల గురించి అడిగారు.

తొలుత ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు.. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు: నిందితులను శుక్రవారం జైలు నుంచి నేరుగా నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి తరలించారు. ఆడియోలో మాట్లాడిన వివరాలను సరిపోల్చడానికి ల్యాబ్‌లో స్వరపరీక్షలు నిర్వహించారు. పోలీసులు స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా సేకరించిన ఆడియో, వీడియో రికార్డుల్లోని మాటలను.. నిందితుల స్వరంతో పోల్చేందుకు ఈ పరీక్షలు చేశారు.

అనంతరం నిందితులను వేరువేరుగా రాజేంద్రనగర్‌ ఠాణాకు తరలించారు. సిట్‌ సభ్యులైన డీసీపీలు కల్మేశ్వర్‌, జగదీశ్వర్‌రెడ్డి, ఏసీపీ గంగాధర్‌, ఇన్స్‌పెక్టర్‌ లక్ష్మీరెడ్డి నిందితులను అక్కడికి తీసుకొచ్చారు. సిట్‌ సభ్యులతో పాటు సైబరాబాద్‌ ఎస్వోటీ అదనపు డీసీపీ నారాయణ, అదనపు డీసీపీ (క్రైం) నర్సింహ్మరెడ్డి ఠాణాకు వచ్చారు. ముగ్గురు నిందితులను వేర్వేరు గదుల్లో విచారించారు. మొదటిరోజు చాలా ప్రశ్నలకు తమకు తెలియదన్నట్లుగా ముక్తసరిగా స్పందించిన నిందితులు.. రెండోరోజు కొన్నింటికి సమాధానాలివ్వక తప్పలేదు.

..

ఓ వైపు సమీక్ష.. మరోవైపు విచారణ: మధ్యాహ్నం 3 గంటలకు సిట్‌ అధిపతి సీవీ ఆనంద్‌ రాజేంద్రనగర్‌ ఠాణాకు వచ్చారు. సిట్‌ సభ్యులతో సమీక్షించి.. విచారణ తీరును తెలుసుకున్నారు. కోర్టు ఇచ్చిన గడువు రెండు గంటల్లో ముగుస్తుందనగా, ఆయన కొన్ని ప్రత్యేక ప్రశ్నలను సిద్ధం చేసుకుని నిందితులను వేర్వేరుగా విచారించినట్లు తెలిసింది.

సాయంత్రం 5.30 గంటల సమయంలో వారిని భారీ బందోబస్తు మధ్య మళ్లీ జైలుకు పంపించారు. నిందితులు వెళ్లిన తరువాత సీవీ ఆనంద్‌ ఏసీపీ కార్యాలయంలోనే మరో గంటపాటు ఉన్నారు. అనంతరం నగర కమిషనరేట్‌కు వెళ్లి అక్కడా సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. నిందితుల విచారణ సందర్భంగా పోలీసులు రాజేంద్రనగర్‌ ఠాణా ప్రహరీగేటును ఏకంగా పరదాలతో కప్పేశారు.

25 వరకు రిమాండ్‌

బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు సోమవారానికి వాయిదా: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో నిందితుల రిమాండ్‌ను నాంపల్లిలోని ఏసీబీ న్యాయస్థానం ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించింది. శుక్రవారంతో రిమాండ్‌ ముగియడంతో పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరచగా మరో 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది. కోర్టుకు తెలిపిన సమయానికంటే 50 నిమిషాల ఆలస్యంగా నిందితులను హాజరుపరచడంపై డిఫెన్స్‌ న్యాయవాది అభ్యంతరం తెలిపారు.

వాదనల అనంతరం బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసును నమోదు చేసే అధికారం ఏసీబీకి తప్ప స్థానిక పోలీసులకు లేదని నిందితుల న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 17డి ప్రకారం పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలపగా.. నిందితుల న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సెక్షన్‌ ప్రకారం మెట్రోపాలిటన్‌ నగరంలో ఏసీపీ స్థాయి అధికారికి మాత్రమే కేసు నమోదు చేసే అధికారం ఉందని, ఘటన జరిగిన మొయినాబాద్‌ మెట్రోపాలిటన్‌ పరిధిలోకి రాదన్నారు. నిందితులు దిల్లీ నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన అవసరమేంటని ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాది ప్రశ్నించగా, పూజలు నిర్వహించేందుకు వచ్చారని, ఈ కేసు.. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో జరిగిన కుట్ర అంటూ నిందితుల తరఫు న్యాయవాది బదులిచ్చారు. విచారణ సందర్భంగా దర్యాప్తు అధికారి ఒకరు తనను తీవ్ర అసభ్యపదజాలంతో దూషించినట్లు నందకుమార్‌ ఏసీబీ ప్రత్యేక కేసుల న్యాయస్థానంలో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.