హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని పింగళి వెంకటరామి రెడ్డి హాల్లో హోం శాఖ మాజీ మంత్రి నాయని నర్సింహారెడ్డి ఆయన సతీమణి సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, రాజ్యసభ మాజీ సభ్యుడు హనుమంతరావు, యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
నాయిని దంపతుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాయిని నర్సింహారెడ్డి అన్ని వర్గాల ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కార్మిక నేతగా, హోం శాఖ మంత్రిగా ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: వరద సాయంపై ప్రధానికి లేఖరాసినా స్పందించలేదు: కేటీఆర్