Nagababu on Pavan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గణ రచించిన ‘ది రియల్ యోగి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ సోదరుడు నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్ తెలుగుదేశం, బీజేపీలో చేరితే మంత్రి పదవి వచ్చేదన్న నాగబాబు పదవుల కోసం కాకుండా ప్రజలకు మంచి చేయాలనే పార్టీ పెట్టారని అన్నారు. రాజకీయ నాయకుడైతే కోట్లాది మందికి సేవ చేయవచ్చని పవన్ భావించారని వివరించారు.
రేపు ఎలా బతకాలన్న ఆలోచన పవన్‌కు లేదు. ఓ మనిషి ఎలా ఉండాలో ఎలా ఉంటే బాగుంటుందో.. కల్యాణ్ బాబును చూస్తే తెలుస్తుంది. తనకున్న ఆస్తులన్నింటిని పిల్లల పేర రాసి జనసేన పార్టీ స్థాపించాడు. కల్యాణ్ బాబు మీద రాసిన పుస్తకం ఎంత హిట్ అవుతుందో నాకు తెలియదు కాని ఒక్కసారైనా ఈ పుస్తకం చదవాలి. - నాగబాబు, సినీ నటుడు
ఇవీ చదవండి:
- '2009లో బీటెక్ చేసిన రోహిత్ రెడ్డి.. 2014లో ఇంటర్ చదివాడా?'
- "డిజిటైజ్, డీకార్బనైజ్, డీసెంట్రలైజ్ అన్న త్రీడీ మంత్రం నెరవేరుతోంది"
- 'బిహార్ కల్తీ మద్యానికి 200 మంది బలి'.. ఆ పోలీస్ స్టేషన్ నుంచే 'సారా' లీక్!