ETV Bharat / state

న్యాక్ సంస్థకు.. సీఐడీసీ 'విశ్వకర్మ' అవార్డ్

దిల్లీలో 12వ సీఐడీసీ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. నిర్మాణ రంగంలో అత్యున్నత ప్రమాణాలు పాటించిన పలు సంస్థలకు అవార్డులు అందజేశారు సంస్థ ప్రతినిధులు. ఈ ఏడాది రాష్ట్రానికి చెందిన న్యాక్​ సంస్థకు ఓ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది.

nac received the prestigious cidc vishwakarma award
న్యాక్ సంస్థకు.. సీఐడీసీ 'విశ్వకర్మ' అవార్డ్
author img

By

Published : Mar 7, 2021, 8:47 PM IST

12వ సీఐడీసీ విశ్వకర్మ అవార్డుల ప్రధానోత్సవం దిల్లీలో వైభవంగా జరిగింది. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో హైదరాబాద్ న్యాక్​కు నిర్మాణ నైపుణ్య అభివృద్ధి అచీవ్‌మెంట్ అవార్డు వరించింది. ఈ అత్యున్నత పురస్కారాన్ని పీఅండ్ ఆర్ డైరెక్టర్ ఐ.శాంతి డైరెక్టర్, పీజీ కోర్సెస్ కే రాధాకృష్ణ అందుకున్నారు. ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం పట్ల రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అభినందించారు.

13,000 మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా చేసిన ఉత్తమ కృషికి ఎన్‌ఐసీ ఈ అవార్డును అందుకుందని మంత్రి వెల్లడించారు. వారిలో 2,600 మంది నిరుద్యోగ యువకులు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 10,400 మంది నిరుద్యోగులకు, కొవిడ్ లాక్‌డౌన్ పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్మాణరంగ కార్మికులు, వలస కార్మికులకు న్యాక్ శిక్షణ ఇచ్చిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ: మంత్రి ఇంద్రకరణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.