ETV Bharat / state

nabard: రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లాలి: నాబార్డ్ ఛైర్మన్ - తెలంగాణ వార్తలు

వ్యవసాయ పంటల నుంచి మూడో వంతు రైతులు ఉద్యాన పంటల సాగు వైపు మళ్లాలని నాబార్డ్ ఛైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు కోరారు. తెలుగు రాష్ట్రాలు ఉద్యాన పంటలకు అనుకూలమని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని అగ్రీ-హార్టీకల్చర్ సొసైటీని ఆయన సందర్శించారు.

nabard chairman, horticulture crops
ఉద్యాన పంటలతో ఆదాయం, నాబార్డ్ ఛైర్మన్ గోవిందరాజులు
author img

By

Published : Aug 1, 2021, 5:19 PM IST

ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన పంటల సాగులో కొత్త పుంతలు తీసుకురావాలని నాబార్డ్ ఛైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు అన్నారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని అగ్రీ-హార్టీకల్చర్ సొసైటీని ఆయన సందర్శించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో విశేష సేవలందించి పదవీ విరమణ అనంతరం విశ్రాంత అధికారుల నేతృత్వంలో సుధీర్ఘ కాలంగా రైతులకు బోధన, విస్తరణ, ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్న కార్యకలాపాలు తెలుసుకున్నారు. పర్యావరణహితంగా జీవవైవిధ్యం పరిరక్షణ కోసం కొత్త రకాల పంటలు పరిచయం చేస్తున్న ఈ సొసైటీ... తెలుగు రాష్ట్రాల్లో ద్రాక్ష పంటకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి తీరును అభినందించారు.

నాబార్డ్ లక్ష్యం అదే..

వాతావరణ మార్పుల నేపథ్యంలో పంటల మార్పిడి కోసం నాబార్డ్ అనేక కార్యక్రమాలు చేపడుతూ... రైతుల్లో కొత్త నైపుణ్యాలు నేర్పుతున్న ఈ సొసైటీకి తమ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉద్యాన పంటల సాగుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అనుకూలం కావడం వల్ల పంట మార్పిడి ద్వారా మామిడియే కాకుండా ఆయిల్‌ఫాం, నిమ్మ, దానిమ్మ, బత్తాయి, డ్రాగన్ ఫ్రూట్ సాగు వైపు మళ్లాలని సూచించారు. కొత్త పంటల సాగు ద్వారా సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేసి రైతుల ఆదాయం పెంచాలన్నది నాబార్డ్ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఎగుమతి అవకాశాలు పుష్కలంగా ఉన్న తరుణంలో ఉద్యాన శాఖ, విశ్వవిద్యాలయాలు ప్రత్యేక చొరవ చూపాలి. వ్యవసాయ పంటల నుంచి మూడో వంతు రైతులను ఉద్యాన పంటల సాగు వైపు తీసుకురావాలి. అందుకోసం రైతులకు అవసరమైన శిక్షణ, నైపుణ్యాలు, సూక్ష్మ సేద్యం, బ్యాంకింగ్ రుణ సదుపాయాలు, ఇతర ప్రణాళికలు నాబార్డ్ వద్ద ఉన్నాయి.

-చింతల గోవిందరాజులు, నాబార్డ్ ఛైర్మన్

రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లాలి

ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ సంచాలకులు లోక వెంకటరామిరెడ్డి, నాబార్డ్ సీజీఎం వైకే రావు, శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ ఉపకులపతి డాక్టర్ నీరజా ప్రభాకర్, టీఎస్ ఆగ్రోస్ ఎండీ కె.రాములు, అగ్రీ-హార్టీకల్చర్ సొసైటీ ప్రతినిధులు, విశ్రాంత అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: lal darwaza bonalu: నియంత పాలన నుంచి విముక్తి చేయి తల్లీ: విజయశాంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.