ETV Bharat / state

భవిష్యత్తులో వ్యవసాయం బంగారమయం: నాబార్డ్‌ ఛైర్మన్‌ - బార్డ్‌ ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు

దేశంలో భవిష్యత్తు వ్యవసాయానిదే అని నాబార్డ్‌ ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉత్పాదకత, నాణ్యత పెంపు, నిల్వ, ప్రోసెసింగ్, విదేశాలకు ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని వెల్లడించారు. కొవిడ్‌ కారణంగా రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అనే విషయం మరోసారి రుజువైందన్నారు.

Nabard Chairman chinthala Govindarajulu On Agriculture-Loans
ఆ విషయం మరోసారి రుజువైంది:నాబార్డ్‌ ఛైర్మన్‌
author img

By

Published : Sep 3, 2020, 11:32 AM IST

రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కౌలు చట్టాలకు రూపకల్పన చేస్తే కౌలు రైతులకు రుణ సదుపాయం మరింత సులువు అవుతుందని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ది బ్యాంక్‌- నాబార్డ్‌ ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు చెప్పారు.

నాబార్డ్‌ ఛైర్మన్‌ గోవిందరాజులతో ఈటీవీ భారత్​ ముఖాముఖి పార్ట్- 1

ఆ దిశగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచనలు చేసినట్టు ఆయన చెప్పారు. మొత్తం నాబార్డు రుణాలు, గ్రామీణాభివృద్ది కేటాయింపుల్లో పది శాతం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటోందని నాబార్డ్‌ ఛైర్మన్‌ వెల్లడించారు. కొవిడ్‌ నేపథ్యంలో మొత్తం ఒక లక్ష 30 వేల కోట్ల రూపాయలు ఈ ఏడాది రైతులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన ఈటీవీ భారత్​కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆ విషయం మరోసారి రుజువైంది:నాబార్డ్‌ ఛైర్మన్‌ పార్ట్​-2

రుణాల పర్యవేక్షణకు త్వరలో నిరీక్షణ పేరుతో ఓ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు గోవిందరాజులు వివరించారు. వచ్చే ఆరు నెలల్లో పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఙానం ఉపయోగించటం ద్వారా దేశ వ్యాప్తంగా మొత్తం రుణ విధానాన్ని నేరుగా పర్యవేక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కొవిడ్‌ కారణంగా దేశంలో రైతే రాజు, వెన్నెముక అన్నది మరోసారి రుజువైందంటోన్న నాబార్డ్‌ ఛైర్మన్‌ గోవిందరాజులుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి....

నాబార్డ్‌ ఛైర్మన్‌ గోవిందరాజులతో ఈటీవీ భారత్​ ముఖాముఖి పార్ట్​-3
నాబార్డ్‌ ఛైర్మన్‌ చింతల గోవిందరాజులతో ఈటీవీ భారత్​ ముఖాముఖి పార్ట్​ -4

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.