ETV Bharat / state

కుదేలైన రంగాలకు చేయూతనిస్తున్న 'డెక్కన్ హాట్' - telangana news'

దేశంలో గ్రామీణ, వ్యవసాయాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న నాబార్డ్‌... స్వయం సహాయ మహిళా బృందాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మంచి ఆర్థిక చేయూతనిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ వృత్తులు, అంకుర సంస్థలు, చేనేత కార్మికులు, చేతి వృత్తుల కుటుంబాల్లో వృత్తి నైపుణ్యాలతో పాటు స్వయం ఉపాధి, మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తోంది. కొవిడ్ నేపథ్యంలో కుదేలైన రంగాలకు కొంతైనా జవసత్వాలు కల్పించాలన్న లక్ష్యంతో రాజధానిలో 'డెక్కన్ హాట్' పేరిట జాతీయ స్థాయి ప్రదర్శన నిర్వహిస్తోంది. దేశం నలుమూలల నుంచి ఎస్‌హెచ్‌జీ, ఎఫ్‌పీఓల సభ్యులు, చేతివృత్తుల కుటుంబాలు తమ ఉత్పత్తులు ప్రదర్శన, విక్రయం చేపట్టడం విశేషం.

కుదేలైన రంగాలకు చేయూతనిస్తున్న 'డెక్కన్ హాట్'
author img

By

Published : Mar 4, 2021, 10:55 AM IST

భాగ్యనగరంలో 7వ 'డెక్కన్ హాట్-2021' పేరిట జాతీయ స్థాయి ప్రదర్శన సందడిగా సాగుతోంది. సికింద్రాబాద్‌లోని సింధీ కాలనీ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం భవన్‌లో నాబార్డ్ ఆధ్వర్యంలో ఆరు రోజులపాటు జరగనున్న ఈ సంతను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా చేతుల మీదుగా ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి స్వయం సహాయ బృందాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు.

కుదేలైన రంగాలకు చేయూతనిస్తున్న 'డెక్కన్ హాట్'

ఔట్​లెట్ల ద్వారా మార్కెటింగ్..

దాదాపు 50 పైగా స్టాళ్లల్లో సేంద్రీయ, ప్రకృతి, గో-ఆధారిత విధానాల్లో పండించిన వ్యవసాయోత్పత్తులు, దేశీవాళీ వరి బియ్యం, చిరుధాన్యాలు, బిస్కట్లు, ఇతర పిండి వంటలు, సేంద్రీయ బెల్లం, రుచికరమైన పచ్చళ్లు, సుగంధ ద్రవ్యాలు, చేనేత వస్త్రాలు, ఔషధ ఉత్పత్తులు, గానుగనూనెలు, గాజులు, బొమ్మలు, ఆయుర్వేద ఉత్పత్తులు, జ్యూట్ బ్యాగులు, రెడీమేడ్ దుస్తులు, ఇతర చేతి వృత్తుల కళాకృతులు ప్రదర్శిస్తున్నారు. గుంటూరు జిల్లాలో రైతులు బృందంగా ఏర్పడి సేంద్రీయ పాలు, చిరుధాన్యాలు, బ్లాక్ రైస్, నవారా దేశీవాళీ బియ్యం, బెల్లం, ఇతర నిత్యావసర వస్తువులు ఉత్పతి చేసి సొంతంగా ఔట్‌లెట్ల ద్వారా మార్కెటింగ్ చేస్తున్నామని రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు తెలిపారు.

విభిన్న రంగాల్లో దూసుకెళ్తూ..

నాబార్డ్ ఆర్థిక సాయంతో గ్రామీణ స్థాయిలో స్వయం సహాయక బృందాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు విభిన్న రంగాల్లో దూసుకుపోతున్నాయి. క్షేత్రస్థాయిలో వ్యవసాయ, వంటకాలు, గాజులు, బ్యాగులు, రెడీమేడ్ దుస్తులు, అందమైన డిజైన్లతో కూడిన అలంకరణ సామగ్రి తయారు చేస్తూ వ్యాపార, మార్కెటింగ్ అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఆర్థిక స్వావలంభన సాధిస్తున్నారు. తాము ఉపాధి పొందుతూ పదిమంది మహిళలకు సైతం ఉపాధి కల్పిస్తున్నారు. పాల్వంచకు చెందిన ఓ సంఘం తాటి ఆకులతో తయారు చేసిన ఆకర్షణీయమైన బ్యాగులు, వివిధ ఆకృతుల్లో నమూనాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఖమ్మం శివారు రఘునాథపాలెంకు చెందిన ఓ మహిళ... సొంతంగా పచ్చళ్ళు, పొడులు తయారు చేసిన ఏకంగా విదేశాలకు సైతం పంపుతూ స్వయం ఉపాధి పొందుతోంది. మెదక్‌కు చెందిన ఓ ఎస్‌హెచ్‌సీ బృందం నేతృత్వంలో మహిళలకు జ్యూట్ బ్యాగుల తయారీలో శిక్షణ ఇస్తుంది.

కొయ్య బొమ్మలకు డిమాండ్..

కొండపల్లి కొయ్య బొమ్మల తరహాలోనే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కర్ణాటక చెన్నపట్నం నుంచి ఓ స్వయం సహాయక బృందం తయారు చేసిన కొయ్య బొమ్మలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు సందర్శకులు అత్యంత ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల జాతిని ఉద్దేశించి మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో చెన్నపట్నం కొయ్యల తయారీ, నైపుణ్యాలు ప్రస్తావించారు. చేతివృత్తుల కళాకారులను అభినందించారు. గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్ నుంచి మహిళలు తయారు చేసిన డోర్ మ్యాట్లు, అలంకరణ రెడీమేడ్ దుస్తులు, కుర్తీస్, బెడ్‌షీట్లు, టేబుల్ క్లాత్, దస్తీలు విక్రయిస్తున్నారు.

కొవిడ్‌ కంటే ముందు హైదరాబాద్ వేదికగా జరిగిన డెక్కన్‌ హాట్‌కు జంట నగరవాసుల నుంచి విశేషమైన స్పందన లభించింది. గత ఏడాది 1.60 కోట్ల రూపాయల వ్యాపారం జరగ్గా... ఇప్పుడున్న పరిస్థితుల్లో సైతం దాదాపు 2 కోట్లరూపాయలు పైగా ఆర్థిక లావాదేవీలు సాగే సూచనలు కనిపిస్తున్నట్లు నాబార్డ్ వర్గాలు స్పష్టం చేశాయి.

ఇదీ చూడండి: గల్ఫ్​లో తగ్గుతున్న ఉపాధి... లక్షల మంది ఇంటి ముఖం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.