Mylardevpally Minor Boy Death Case update : మైలార్‌దేవ్‌పల్లిలోని హౌసింగ్‌బోర్డు జరిగిన మైనర్ బాలుడి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కోపంతో బాలుడిని భర్త హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలింది.. ఈ నెల 27న మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధి లక్ష్మీగూడ హౌసింగ్‌బోర్డు కాలనీలో జరిగిన బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు.
Teenager Murder in Mylardevpally : రెండు నెలల క్రితం బిహార్‌కు చెందిన పంకజ్‌కుమార్ పాశ్వాన్ అలియాస్ పంకజ్ పాశ్వాన్, భార్య లక్ష్మీగూడ హౌసింగ్‌బోర్డుకాలనీకి వలస వచ్చారు. వారితో పాటు వచ్చిన పంకజ్ భార్య బాబాయి, పిన్ని, ఆమెకు సోదరుడి వరుసయ్యే 17 ఏళ్ల మైనర్ బాలుడు ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో నివాసం ఉంటున్నారు. పంకజ్‌పాశ్వన్, ఆ బాలుడు కాటేదాన్‌లోని పరిశ్రమలో పనికి కుదిరారు. రోజూ ఇద్దరు కలసి వెళ్లి వస్తుండేవాడు. వీలు కుదరినప్పుడల్లా ఇద్దరూ మద్యం తాగుతూ ఉండేవారు. భార్యతో ఆ బాలుడు చనువుగా మెలుగుతున్నా వరుసకు తమ్ముడు కావటంతో అనుమానించలేకపోయాడు. మద్యం మత్తులో ఉన్న బాలుడు పలుమార్లు పంకజ్ భార్యతో అక్రమ సంబంధం ఉందంటూ చెప్పేవాడు. బిహార్‌లో ఉన్నపుడు తరచూ తామిద్దరం కలసుకునేవాళ్లమంటూ నోరుజారాడు.
మొదట్లో దీన్ని తేలికగా తీసుకున్నా తరచూ ఇదే విషయాన్ని ప్రస్తావించటంతో భరించలేకపోయాడు. అక్క గురించి తమ్ముడిలా ప్రవర్తించటంతో మనోవేదనకు గురయ్యాడు. ఈ విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని భావించాడు. బాలుడిని హతమార్చితే సమస్య సమసిపోతుందనే అంచనాకు వచ్చాడు. ఈనెల 26న రాత్రి విధులు ముగించుకొని వచ్చాక హత్యకు పథకం వేశాడు. ఈ నెల 27న వేతనం తీసుకునేందుకు ఇద్దరూ కాటేదాన్‌లో పనిచేస్తున్న పరిశ్రమకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. తరువాత పంకజ్ కూరగాయలు కోసే కత్తిని తీసుకొని దాచుకున్నాడు. సిగరెట్ తాగేందుకు బయటకు వెళ్దామంటూ బాలుడిని పిలిచాడు. ఇద్దరూ స్ధానికంగా నిర్మానుష్య ప్రాంతంలోకి చేరారు.
అక్కడున్న సీతాఫలం చెట్టును చూపి పండు కోయాలని బాలుడికి పంకజ్ సూచించాడు. పండు కోసేందుకు వెళ్తున్న బాలుడిని నిందితుడు కత్తితో గొంతుకోశాడు. ప్రాణాలు పోయేంత వరకూ అక్కడే ఉండి బాలుడు మరణించాడని నిర్దారించుకున్నాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంటికెళ్లాక రక్తపు మరకలు అంటిన దుస్తులు వదిలేసి చొక్కా మార్చుకొని పారిపోయాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అక్కడ లభించిన ఆధారాలు సేకరించారు. కొద్దిరోజుల క్రితం బాలుడితో పంకజ్ గొడవ పడినట్టు దర్యాప్తులో గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో భార్యతో అక్రమ సంబంధం ఉందంటూ బాలుడు చెప్పటంతో కోపం పట్టలేక హత్యచేసినట్టు పోలీసులకు వివరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Hyderabad Man Kills Daughter : భవిష్యత్‌లో కష్టాలొస్తాయని.. కూతుర్ని చంపేశాడు
Brother Murder : సోదరిపై వేధింపులు.. అడ్డుచెప్పిన సోదరుడి హత్య.. రాఖీకి 2రోజుల ముందే