ప్రపంచ ఛాంపియన్గా నిలవాలన్న తన కల త్వరగా నెరవేరిందని గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి తెలిపారు. ర్యాపిడ్ చెస్ మహిళల విభాగంలో ప్రపంచ విజేతగా నిలవడం సంతోషంగా ఉందని గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అన్నారు. రష్యాలో శనివారం జరిగిన మహిళల ర్యాపిడ్ చెస్ టోర్నీలో స్వర్ణం గెలిచిన హంపి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ చేరుకున్నారు. ఆమెకు గన్నవరం విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈటీవీ భారత్తో ఆమె ముచ్చటించారు. ఏ మాత్రం అంచనాలు లేకుండా పతకం సాధించడం విశేషమని హంపి చెప్పారు. పాప పుట్టిన తర్వాత రెండేళ్లు ఆటకు దూరంగా ఉన్నా... కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే మళ్లీ ఈ స్థాయికి చేరుకోగలిగానని హంపి తెలిపారు.
ఇవీ చూడండి: సీఎం కేసీఆర్కు శుభాకాంక్షల వెల్లువ