మాంసం ధరల విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు పునరాలోచించాలని హైదరాబాద్ పంజాగుట్ట మటన్‌షాపు యాజమాన్యం కోరింది. జీహెచ్ఎంసీ నిర్ణయించిన ప్రకారంగా నాణ్యమైన మాంసాన్ని కిలోకు 700రూపాయలకు విక్రయించడం ద్వారా తాము నష్టాలకు గురవుతున్నామని షాపు యాజమాని వాపోయారు.
హోల్‌సెల్ మార్కెట్ నుంచి తాము కిలో మాంసాన్ని 675 రూపాయాలకు కొనుగోలు చేసి.. 700 రూపాయలకే విక్రయించడం ద్వారా తామంతా నష్టపోయి అప్పులపాలవుతున్నామన్నారు. పంజాగుట్ట మటన్‌షాపు హైక్వాలిటీ మటన్‌ను విక్రయించడంతో పాటు పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తున్నామని పేర్కొన్నారు.
హోల్‌సేల్ మార్కెట్లో కేజీకి 675 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రవాణా, నిర్వహణ, అద్దె, బిల్లులు, విద్యుత్, కార్మికుల చెల్లింపు, నీరు, పారిశుద్ధ్య ఛార్జీలు వంటి అదనపు ఛార్జీలు అవుతాయన్నారు.ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని మటన్ ధరను పెంచాల్సిందిగా కోరారు.
ఇవీ చూడండి: అమాయకుల భూమి.. అధికారులు తారుమారు చేశారు!