ETV Bharat / state

'కాలుష్య రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలి' - hyderabad news

హైదరాబాద్​ ముషీరాబాద్​ నియోజకవర్గంలోని గాంధీనగర్​లో ఎమ్మెల్యే ముఠాగోపాల్​ పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా... హిమసాయి హైట్స్ అపార్ట్​మెంట్​లో పూల కుండీల కింద ఉన్న ప్లేట్లలో నీళ్లను ఎమ్మెల్యే, కార్పొరేటర్ ముఠా పద్మ శుభ్రం చేశారు.

'కాలుష్యరహిత సమాజ నిర్మాణాన్ని అందరూ కృషి చేయాలి'

author img

By

Published : Jul 12, 2020, 5:25 PM IST

కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాల కార్యక్రమం 10వ వారంలో భాగంగా హైదరాబాద్​ గాంధీనగర్​లోని హిమసాయి హైట్స్ అపార్ట్​మెంట్​లో పూల కుండీల కింద ఉన్న ప్లేట్లలో నీళ్లను ఎమ్మెల్యే, కార్పొరేటర్ ముఠా పద్మ శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే కోరారు. లేనిపక్షంలో దోమలు వ్యాప్తి చెంది సీజనల్​ వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుందని వివరించారు.

సమాజంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని, భౌతిక దూరాన్ని పాటించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రావొద్దని కోరారు.

ఇదీ చదవండి : 'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.