హైదరాబాద్ పరిధిలో మొదటగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్లో 30 పడకలతో కూడిన ఐసోలేషన్ కేంద్రాన్ని(isolation center) ఏర్పాటు చేశారు. ఆ కేంద్రంలో అనునిత్యం ఓ డాక్టర్, నర్సింగ్ స్టాఫ్ అందుబాటులో ఉంటారని కార్పొరేటర్ వివరించారు. కరోనా బాధితులకు భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు.
గాంధీనగర్లోని జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం రాష్ట్రంలో అనేక ఆసుపత్రులకు ఆక్సిజన్, బ్లాక్ ఫంగస్ టీకాలు, రెమిడిసివర్ వ్యాక్సిన్లు(remidisivire vaccine) దిగుమతి చేసిందని ఆయన అన్నారు. కరోనాను జయించడానికి ప్రజలు ధైర్యంతో ముందుకు రావాలని ఈ సందర్భంగా కిషన్రెడ్టి తెలిపారు. ప్రజలు మాస్కు లేకుండా బయటకు రావొద్దని ఆయన సూచించారు.
ఇదీ చూడండి: రాష్ట్ర కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌తో పాటు కీలక అంశాలపై చర్చ