హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కళామందిర్ రోడ్డులోని ఓ ఖాళీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సుమారు 30 సంవత్సరాలున్న ఓ వ్యక్తిని సెంట్రింగ్ కోసం వినియోగించే కర్రలతో కొట్టి కిరాతకంగా హతమార్చారు. ఓ గదిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: బంధువునంటూ ప్రవేశించి పట్టపగలే చోరీ