హైదరాబాద్ శివారు బాలపూర్ ఠాణా పరిధి దేవతలగుట్ట సమీపంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు... ఓ యువకుడి కాళ్లు, చేతులు కట్టి ఉరివేసి హతమార్చారు. దేవతలగుట్టలోని ఓ ప్రైవేటు గోదాం గేటుకు యువకుడి మృతదేహం వేలాడడం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌టీం బృందం ఆధారాలు సేకరించింది.
మృతుడు బాలాపూర్‌కు చెందిన జొన్నాడ ప్రశాంత్‌గా నిర్దరించారు. తల్లిదండ్రుల మరణానంతరం తన పెద్ద సోదరుడు శ్రీకాంత్ వద్ద ఉంటున్నాడు. రెండునెలల క్రితం వరకు ఆర్‌సీఐలో కార్మికుడిగా పని చేశాడు. మృతుడికి, ఆయన సోదరుడికి ఎవరితోనైనా పాత కక్షలున్నాయా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
ఇదీ చూడండి: దొంగతనం చేస్తూ దొరికారు.. చావు దెబ్బలు తిన్నారు...