హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ముగ్గురు యువకులు కలిసి ఓ యువకుడిపై కత్తితో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కేబీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీ వద్ద సమీర్ అనే యువకుడి మీద ముగ్గురు యువకులు హత్యాయత్నం చేశారు. ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు గానూ.. ఎన్టీఆర్నగర్ కాలనీకి చెందిన సోహెల్, ఆసిఫ్, అస్లాం అనే ముగ్గురు యువకులు సమీర్‌పై దాడి చేసినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
సమీర్‌ను అతని ఇంటి నుంచి తీసుకువచ్చి ఆటోలో ఎక్కించుకొని కత్తులతో పొడిచి చంపేందుకు ప్రయత్నించారు. శుక్రవారం రాత్రి ఆటోలో గొడవ జరుగుతుండగా స్థానికులు చూసి కేకలు వేయగా.. నిందితులు సమీర్‌ను ఆటోలోంచి తోసేసి పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సమీర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు