ETV Bharat / state

దొంగ అనుకొని కొ‌ట్టాడు.. ప్రాణం తీశాడు

దొంగ అనే అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన హైదరాబాద్ బాచుపల్లి పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. దొంగతనం చేయటానికి యత్నిస్తున్నాడని భావించి ఓ అమాయకుడిని చితకబాధడం వల్ల లక్ష్మణ్‌ జా అనే మేస్త్రీ‍‍(48) మరణించాడు.

author img

By

Published : Sep 15, 2020, 9:06 PM IST

దొంగ అనుకొని కొ‌ట్టాడు.. ప్రాణం తీశాడు
దొంగ అనుకొని కొ‌ట్టాడు.. ప్రాణం తీశాడు

హైదరాబాద్‌ బాచుపల్లి పీఎస్ పరిధి ప్రగతినగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న అభి వెంచర్‌లో పని చేయడానికి ఒడిశా నుంచి మేస్త్రీల బ్యాచ్‌ సోమవారం వచ్చింది. ఉదయం 4 గంటల సమయంలో లక్ష్మణ్‌ జా(48) అనే మేస్త్రి 'అభి వెంచర్‌కు ఆనుకొని కొత్తగా నిర్మిస్తున్న జ్యోత్స్న అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాడు. అలికిడి కావడం వల్ల అదే అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నర్సింహ.. లక్ష్మణ్‌ను చూసి దొంగ అనుకొని కర్రతో తలపై కొట్టాడు. అనంతరం తాడుతో కట్టి బంధించాడు. దీంతో లక్ష్మణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

వాచ్‌మెన్‌ నర్సింహ చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చి.. ఉదయం ఆరు గంటలకు మరోసారి లక్ష్మణ్‌ను కొట్టగా.. అతను మరోసారి స్పృహ కోల్పోయాడు. పరిస్థితి విషమించడం వల్ల చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో లక్ష్మణ్‌ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాచుపల్లి పీఎస్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నర్సింహను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: పోలీసు అధికారుల ఫొటోలతో సైబర్​ నేరగాళ్ల మోసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.